మళ్లీ ప్రొఫెసర్‌గా… మన్మోహన్ సింగ్!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మళ్లీ అధ్యాపకునిగా పాఠాలు బోధించనున్నారు. యాభై సంవత్సరాల క్రితం పంజాబ్ యూనివర్శిటీలో చివరి క్లాసు తీసుకున్న ఆయన తిరిగి అదే యూనివర్శిటీలో లాజిస్టిక్స్ సబ్జక్టుని చెప్పడానికి ఒప్పుకున్నారు. ఆయన చండీఘర్ వచ్చినపుడు యూనివర్శిటీకి వచ్చి క్లాసులు తీసుకుంటారని, అలా కాకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు బోధిస్తారని పంజాబ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ గ్రోవర్ తెలిపారు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్శిటీ నుండే 1954లో ఎకనమిక్స్‌లో మాస్టర్స్ […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మళ్లీ అధ్యాపకునిగా పాఠాలు బోధించనున్నారు. యాభై సంవత్సరాల క్రితం పంజాబ్ యూనివర్శిటీలో చివరి క్లాసు తీసుకున్న ఆయన తిరిగి అదే యూనివర్శిటీలో లాజిస్టిక్స్ సబ్జక్టుని చెప్పడానికి ఒప్పుకున్నారు. ఆయన చండీఘర్ వచ్చినపుడు యూనివర్శిటీకి వచ్చి క్లాసులు తీసుకుంటారని, అలా కాకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు బోధిస్తారని పంజాబ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ గ్రోవర్ తెలిపారు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్శిటీ నుండే 1954లో ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తరువాత 1957లో అదే యూనివర్శిటీలో ఎకనమిక్స్ లెక్చరర్‌గా చేరారు. 1966లో ఆ ఉద్యోగాన్ని వదిలేసి న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్‌కి ఆర్థిక వ్యవహారాల అధికారిగా వెళ్లారు. ఆ తరువాత మరెన్నో మలుపుల తరువాత ఆయన భారత ప్రధాని కావడం తెలిసిందే.
ఇంతకుముందు పంజాబ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ఉన్న ఆర్‌పి బాంబా, కొన్ని నెలల క్రితం ఒక ఫంక్షన్లో కలిసిన మన్మోహన్ సింగ్‌తో బోధన విషయమై ప్రస్తావించారని అరుణ్ కుమార్ గ్రోవర్ అన్నారు. ఆయన అందుకు ఒప్పుకున్నారని, ఒకసారి ఆయన పాఠాలు చెప్పటం మొదలుపెడితే తరువాత విద్యార్థులు ఆయనను ఢిల్లీలో కూడా కలుస్తూ ఉంటారని అరుణ్ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్శిటీలో జవహర్‌లాల్ నెహ్రూ ఛైర్, ప్రొఫెసర్‌షిప్ హోదాలో బోధన చేస్తారు. యూనివర్శిటీలో మన్మోహన్ సింగ్ ఛైర్‌ని 2009లో ప్రవేశపెట్టగా, ఆ హోదాలో ఇప్పుడు ప్రముఖ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ యోగీందర్ కె అలాగ్ పనిచేస్తున్నారు. 2015 జూన్ వరకు ఆ ఛైర్‌లో అజిత్ సింగ్ ఉన్నారు.