లోకేష్ ఏ ఊరి బిడ్డ?
లోకేష్‌ను మంత్రిని చేయబోతున్నారని వార్తలు రాగానే టీడీపీ నేతలు పోటీ పడి తమ మద్దతు తెలుపుతున్నారు. లోకేష్‌ను మంత్రిని చేయాల్సిందేనని ఒకరు… మంత్రి పదవికి లోకేష్ అన్ని విధాల అర్హుడని ఇంకొందరు, ఇప్పటికే ఆలస్యం అయింది వెంటనే మంత్రిని చేసేయండి అని మరో నేత ఇలా వరుస పెట్టి చినబాబు పదవికి మద్దతు పలుకుతున్నారు. రాజీనామాలు చేసేందుకు ముందుకొచ్చారు మరికొందరు. అయితే ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే… లోకేష్‌కు పోటీ పడి మద్దతు తెలుపుతున్న వారిలో […]
లోకేష్‌ను మంత్రిని చేయబోతున్నారని వార్తలు రాగానే టీడీపీ నేతలు పోటీ పడి తమ మద్దతు తెలుపుతున్నారు. లోకేష్‌ను మంత్రిని చేయాల్సిందేనని ఒకరు… మంత్రి పదవికి లోకేష్ అన్ని విధాల అర్హుడని ఇంకొందరు, ఇప్పటికే ఆలస్యం అయింది వెంటనే మంత్రిని చేసేయండి అని మరో నేత ఇలా వరుస పెట్టి చినబాబు పదవికి మద్దతు పలుకుతున్నారు. రాజీనామాలు చేసేందుకు ముందుకొచ్చారు మరికొందరు. అయితే ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే… లోకేష్‌కు పోటీ పడి మద్దతు తెలుపుతున్న వారిలో ఎక్కువ మంది కృష్ణా జిల్లా నేతలే. చినబాబు కోసం రాజీనామా చేస్తామని ప్రకటించిన బోడే ప్రసాద్, బుడ్డా వెంకన్న ఇద్దరూ కృష్ణా జిల్లాకు చెందిన వారే. అయితే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి కానీ, రాయలసీమ నుంచి గానీ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇలా లోకేష్ కోసం తాము రాజీనామా చేస్తామని ప్రకటించకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
సాధారణంగా తండ్రి పుట్టిన ప్రాంతాన్ని, ఊరిని, కొడుకు రాజకీయంగానైనా, మరో విషయంలోనైనా వారసత్వంగా తీసుకుంటారు. హీరో మహేష్ బాబు లాంటి వారు కూడా గ్రామాలను దత్తత తీసుకోవాల్సి వస్తే తండ్రి సొంతూరునే తీసుకున్నారు. ఎవరి విషయంలోనైనా తండ్రి ప్రాంతమే వారసత్వంగా భావిస్తుంటారు. కానీ లోకేష్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా పరిణామాలు సాగుతున్నాయి. చిత్తూరు జిల్లా నేతల నుంచి రాజీనామా ఆఫర్లు రాకపోవడానికి కారణం అధినాయకత్వం ఆదేశాలేనని భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు తమ ప్రాంతంలో పుట్టినప్పటికీ తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రాయలసీమ వాళ్లు పదేపదే విమర్శిస్తుంటారు. ఇప్పుడు లోకేష్‌ను రాజకీయంగా సొంత ప్రాంతం నుంచి కాకుండా కృష్టాజిల్లా నుంచి ల్యాండ్ చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నించడం చర్చనీయాంశమవుతోంది. రాయలసీమను సొంతప్రాంతంగా చంద్రబాబు కుటుంబం భావించడం లేదా లేక తన సామాజిక వర్గం అధికంగా వున్నకృష్ణా, గుంటూరు జిల్లాలనే తమ ప్రాంతంగా భావిస్తున్నారా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.
Click on Image to Read: