Telugu Global
NEWS

"ఏమప్పా... నీ తమ్ముడు జోరు మీదున్నాడు"- జేసీ బెదిరింపు కాల్ రికార్డ్

అనంతపురం టీడీపీ నేతలకు అదే పార్టీకిచెందిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తన అన్న దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటికీ అనంతపురం నగర పరిధిలో తమ ప్రభావం లేకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలతో కయ్యానికి సై అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు నగరంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప చౌదరి ఒక వైపు జేసీ బ్రదర్స్ ఒక వైపు అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజాగా వీరి వర్గపోరులో […]

ఏమప్పా... నీ తమ్ముడు జోరు మీదున్నాడు- జేసీ బెదిరింపు కాల్ రికార్డ్
X

అనంతపురం టీడీపీ నేతలకు అదే పార్టీకిచెందిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తన అన్న దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటికీ అనంతపురం నగర పరిధిలో తమ ప్రభావం లేకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలతో కయ్యానికి సై అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు నగరంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప చౌదరి ఒక వైపు జేసీ బ్రదర్స్ ఒక వైపు అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజాగా వీరి వర్గపోరులో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ప్రభాకర చౌదరి వర్గానికిచెందిన అనంత డిప్యూటీ మేయర్ గంపన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఫోన్‌లో జేసీ బెదిరించారంటూ వాయిస్ రికార్డు సీడీతో కలిసి ఫిర్యాదు ఇచ్చారు. ” ఏముందప్పా… నీ తమ్ముడు చాలా జోరుగా ఉన్నాడు. వాడు పోయి సీఎంకు రిపోర్టు చేస్తాడంట. వాడికి సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు. నేను రేపటి నుంచి మీ స్థలాలు, మీకథంతా పట్టించుకుంటున్నా. మీ ప్రభాకర్ చౌదరిని పిలుచుకుని రండి. నాకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు. ఇకపై ప్రతిచోట నేనుంటా” అని జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించినట్టు వాయిస్ రికార్డులో ఉంది. తన ప్రాణాలకు ఏమైనా ముప్పు వాటిల్లితే అందుకు జేసీదే బాధ్యత అని డిప్యూటీ మేయర్ గంపన్న చెప్పారు. అది అనంతపురం టీడీపీలో రగులుతున్న వర్గపోరు.

Click on Image to Read:

lokesh

jc-prabhakar-reddy1

mohan-babu

jc-diwakar-reddy

roja

YCP-MLA-Sunil

bramini-lokesh

5eaa7b3e-f096-4ce2-bd70-d8594018f1b6

Rajya-Sabha-Seat

panama-papers

harish-rao

chandrababu party

VC-Apparao

Pratyusha-Banerjee-Suicide-

ysrcp-mla

satishreddy MLC

First Published:  7 April 2016 4:21 AM IST
Next Story