చింటూ టార్గెట్‌గా కోర్టు అవరణలోనే బాంబు పేలుడు
చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం సంభవించిన ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బాలాజీ నాయుడు అనే గుమాస్తాకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూటర్‌లో ఈ బాంబులు అమర్చినట్టు తేలింది. నాలుగు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న చింటూను పోలీసులు కోర్టుకు హాజరుపరిచిన సమయంలోనే ఈ బాంబు పేలుడు జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. మేయర్ దంపతుల […]
చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం సంభవించిన ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బాలాజీ నాయుడు అనే గుమాస్తాకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూటర్‌లో ఈ బాంబులు అమర్చినట్టు తేలింది. నాలుగు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
అయితే చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న చింటూను పోలీసులు కోర్టుకు హాజరుపరిచిన సమయంలోనే ఈ బాంబు పేలుడు జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. మేయర్ దంపతుల హత్య వెనుక జిల్లాకు చెందిన కొందరు రాజకీయ ముఖ్యనేతల ప్రమేయం కూడా వుందని అపట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. మేయర్ దంపతుల ఆధిపత్యాని భరించలేనివారు చింటూను ఉసిగొల్పినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే చింటూ అసలు నిజాలు భయటకి చెబితే తమ రాజకీయ జీవితానికి కూడా ఇబ్బందులొస్తాయని భావించిన వ్యక్తులే చింటూను టార్గెట్ చేసి వుండవచ్చని అనుమానిస్తున్నారు. కోర్టు ప్రాంగణంలోనే బాంబు పేలుడు జరగడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజకీయ వత్తిడిల నేపధ్యంలో అసలు దోషులను గుర్తిస్తారో లేదో చూడాలి?
Click on Image to Read: