పనామా సంచలనం " జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లు
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా జాబితాలో కొత్తకొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ముగ్గురు తెలుగువాళ్ల గుట్టు రట్టైంది. పనామా మూడో జాబితాలో ముగ్గురు తెలుగువాళ్ల పేర్లు ఉన్నాయి. నల్ల కుబేరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మోటూరి శ్రీనివాస ప్రసాద్, వోలం భాస్కరరావు, భావనాశి జయకుమార్ పేర్లు ఉన్నాయి. జాబితాలో ఇంకొంతమంది భారతీయులు కూడా ఉన్నారు. 1) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ ప్రసాద్ పేరు ఉంది. ఈయన నిబంధనలకు విరుద్దంగా నాలుగు విదేశీ […]
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా జాబితాలో కొత్తకొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ముగ్గురు తెలుగువాళ్ల గుట్టు రట్టైంది. పనామా మూడో జాబితాలో ముగ్గురు తెలుగువాళ్ల పేర్లు ఉన్నాయి. నల్ల కుబేరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మోటూరి శ్రీనివాస ప్రసాద్, వోలం భాస్కరరావు, భావనాశి జయకుమార్ పేర్లు ఉన్నాయి. జాబితాలో ఇంకొంతమంది భారతీయులు కూడా ఉన్నారు.
1) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ ప్రసాద్ పేరు ఉంది. ఈయన నిబంధనలకు విరుద్దంగా నాలుగు విదేశీ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. 2011లో బ్రిటిష్ వర్జిస్ ఐలాండ్స్‌లో ఈ కంపెనీలు రిజస్టర్ అయ్యాయి. ప్రసాద్ నందన్ క్లీన్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండటంతోపాటు సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కో ఓనర్ గా కొనసాగుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బయోడీజిల్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పినట్టు ఘనత సాధించిన ప్రసాద్ పేరిట మరో 12 కంపెనీలు కూడా ఉన్నాయి. బయోడీజిల్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 2012 ఏప్రిల్ 2న ఆయన అరెస్ట్ కూడా అయ్యారు.. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అయితే కేవలం ఒక డాలర్‌తో కంపెనీ స్థాపించామని … అయితే ఈ కంపెనీలన్నీ ఇప్పుడు నడవడం లేదని మోతూరి శ్రీనివాస్ ప్రసాద్ వివరణ ఇచ్చారు.
2)మరొకరు భావనాసి జయకుమార్. హైదరాబాద్‌కే చెందిన ఈయన ప్రసాద్, వోలం భాస్కర్‌రావుతో కలిసి నడుపుతున్నారు. నందన్ టెక్నాలజీస్‌ను 2008లో స్థాపించారు. గ్రాండ్ బే కెనాల్ లిమిటెడ్‌ను 2015లో స్థాపించారు. నందన్ టెక్నాలజీస్‌కు అనుబంధంగా మరో ఆరు కంపెనీలున్నాయి. వాటిలోనూ జయకుమార్ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే నందన్ టెక్నాలజీస్, ఎస్ డీ వెంచర్స్, గ్రాండ్ బే కెనాల తదితర విదేశీ కంపెనీలతో తనకెలాంటి సబంధం లేదని జయకుమార్ చెప్పారు. వాటిని వోలం భాస్కర్ రావు మేనేజింగ్ డైరెక్టర్ గా నిర్వహిస్తున్నారని చెప్పారు.
3)వోలం భాస్కర్ రావు నందన్ టెక్నాలజీస్, దాని అనుబంధం సంస్థలు ఆరింటికి భాస్కర్ రావు ఎండీగా ఉన్నారు. సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కు సహ యజమానిగా, నందన్ క్లీన్ టెక్ లిమిటెడ్ కు ప్రమోటర్ గా, 2008 ఏప్రిల్ నుంచి ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాల నుంచి రిటైరైన ఆయన బ్రిటన్ లో గడుపుతున్నారు. ఆయన తరఫున కొడుకు వోలం సందీప్ వివరణ ఇచ్చారు. కంపెనీలన్నింటినీ మోతూరి శ్రీనివాస్ ప్రసాద్ టేకోవర్ చేసుకున్నారని, విదేశాల్లో వ్యాపార ఉద్దేశంతో ఈ కంపెనీలు పెట్టినా.. ఇవి ప్రస్తుతం పనిచేయడం లేదన్నారు.
Click on Image to Read: