ఎంగిలి కూడు హేయం- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు
ఏపీలో ఎమ్మెల్యే ఫిరాయింపులు ఎక్కువైన వేళ సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయింపుదారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారడం హేయమైన చర్య అన్నాడు. ఒక కంచంలో తిని, ఒక ఇంటిలో ఉండి మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. చావైనా బతుకైనా ఒకసారి గెలిచాక ఐదేళ్ల పాటు ఒకే పార్టీలో ఉండాలన్నారు. ఒకవేళ నాయకత్వం నచ్చకపోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలే గానీ ఇలా ఎంగిలి కూడుకు ఆశపడడం […]
ఏపీలో ఎమ్మెల్యే ఫిరాయింపులు ఎక్కువైన వేళ సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయింపుదారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారడం హేయమైన చర్య అన్నాడు. ఒక కంచంలో తిని, ఒక ఇంటిలో ఉండి మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. చావైనా బతుకైనా ఒకసారి గెలిచాక ఐదేళ్ల పాటు ఒకే పార్టీలో ఉండాలన్నారు. ఒకవేళ నాయకత్వం నచ్చకపోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలే గానీ ఇలా ఎంగిలి కూడుకు ఆశపడడం సరికాదన్నారు. ఆత్మను, వ్యక్తిత్వాన్ని చంపుకుని అవినీతి సొమ్ముకోసం పార్టీలు మారడం ఎందుకని ప్రశ్నించారు. త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఇప్పుడున్న పార్టీల్లోనే చేరుతానన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ తనకు బంధువులేనని కానీ బంధుత్వం పేరు చెప్పుకుని సాయం కోరే వ్యక్తిని తాను కాదన్నారు.
తాను ఆవేశపరుడినే గానీ అవినీతిపరుడిని కాదన్నారు మోహన్ బాబు. పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే బాధగా ఉందన్నారు.కొత్తగా పార్టీ యోచన లేదని… ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దానిలో చేరుతానని చెప్పారు. తాను కుల రాజకీయాలు చేయనన్నారు. తిరుపతిలో మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Click on Image to Read: