చంద్రబాబు గ్రాండ్ పార్టీ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు. తన మనవడి పుట్టిన రోజు సందర్బంగా ఉగాది రోజు సాయంత్రం ఈ పార్టీ ఏర్పాటు చేశారు. విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీకి భారీగా అతిథులను ఆహ్వానిస్తున్నారు. దాదాపు 750 మంది అతిథులకు ఆహ్వానాలు పంపారు. వీరిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ముఖ్యులు ఉన్నారు. 8వ తేది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 11 […]
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు. తన మనవడి పుట్టిన రోజు సందర్బంగా ఉగాది రోజు సాయంత్రం ఈ పార్టీ ఏర్పాటు చేశారు. విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీకి భారీగా అతిథులను ఆహ్వానిస్తున్నారు. దాదాపు 750 మంది అతిథులకు ఆహ్వానాలు పంపారు. వీరిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ముఖ్యులు ఉన్నారు.
8వ తేది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు కొద్ది రోజుల క్రితమే అయిపోయింది. కుటుంబసభ్యుల సమక్షంలో బర్త్‌డే పార్టీ చేశారు. కానీ తిథి, నక్షత్రం ఆధారంగా ఉగాది రోజు మరోసారి భారీ పార్టీ నిర్వహిస్తున్నారు. అతిథులను ఆహ్వానించడం ఇప్పటికే పూర్తయింది.
Click on Image to Read: