తెలంగాణ కేబినెట్‌లోకి ఆ ఇద్దరు బీజేపీ నేతలు ?
రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయా? ఇప్పటి దాకా ఉప్పు-నిప్పులా ఉన్నబీజేపీ- టీఆర్ ఎస్ మిత్రులు కాబోతున్నారా? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ కొత్త చర్చ జోరుగా సాగుతోంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్‌లు రాష్ట్ర మంత్రి వర్గంలో చేరుతారంటూ కొత్త ప్రచారం మొదలైంది. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరించనున్న క్రమంలో నిజామాబాద్ ఎంపీ కవితకు చోటు కల్పిస్తారని, ఫలితంగా రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులు వస్తాయన్నది దీని సారాంశం. […]
రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయా? ఇప్పటి దాకా ఉప్పు-నిప్పులా ఉన్నబీజేపీ- టీఆర్ ఎస్ మిత్రులు కాబోతున్నారా? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ కొత్త చర్చ జోరుగా సాగుతోంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్‌లు రాష్ట్ర మంత్రి వర్గంలో చేరుతారంటూ కొత్త ప్రచారం మొదలైంది. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరించనున్న క్రమంలో నిజామాబాద్ ఎంపీ కవితకు చోటు కల్పిస్తారని, ఫలితంగా రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులు వస్తాయన్నది దీని సారాంశం. అయితే, ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎవరూ ధ్రువీకరించలేదు. ఈ ప్రచారం గత ఏడాది కాలంగా సాగుతున్నదే అయినప్పటికీ, 2019లో టీడీపీతో పొత్తు లేదంటూ ఇటీవల కేంద్ర మంత్రి దత్తాత్రేయ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఓ వైపు తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం రోజురోజుకు తగ్గిపోతోంది. మరోవైపు ఓటుకు నోటు కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఈ దశలో టీడీపీతో అంటకాగితే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనలో కమల నాథులు ఉన్నారన్నది వాస్తవం. పైగా తెలంగాణలో ఇప్పటివరకు మెదక్, వరంగల్ పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా బీజేపికి కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి. ఈ కారణాల వల్లే.. టీడీపీతో స్నేహం కొనసాగించడం మంచిది కాదన్న నిర్ణయానికి బీజేపీ వచ్చిందని, అందుకే కేంద్రం- రాష్ట్రంలో పొత్తుకు సిద్ధపడిందని పలువురు విశ్లేషిస్తున్నారు.
lick on Image to Read: