ఆ సమస్యను ఆపుతాయి!
సాఫీగా మూత్రవిసర్జన చేయలేకపోవడం అనే సమస్య పెద్దవాళ్లలో కనబడుతుంటుంది. యూరిన్ సరిగ్గా బయటకు వెళ్లకపోతే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీరు, సోడియం (ఉప్పు) అదనంగా శరీరంలో ఉండిపోతుంది. చాలా సార్లు వైద్యులు ఈ సమస్యకు మందులు రాస్తుంటారు. వాటితో మళ్లీ కండరాల నొప్పులు, దద్దుర్లు, తలనొప్పి, మగత లాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి బాధలు లేకుండా, ఎలాంటి వ్యతిరేక ప్రభావాలు లేకుండా శరీరంలోని అదనపు ద్రవాలు, సోడియం బయటకు వెళ్లాలంటే ఈ కింది చిట్కాలు పాటించవచ్చు- […]
సాఫీగా మూత్రవిసర్జన చేయలేకపోవడం అనే సమస్య పెద్దవాళ్లలో కనబడుతుంటుంది. యూరిన్ సరిగ్గా బయటకు వెళ్లకపోతే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీరు, సోడియం (ఉప్పు) అదనంగా శరీరంలో ఉండిపోతుంది. చాలా సార్లు వైద్యులు ఈ సమస్యకు మందులు రాస్తుంటారు. వాటితో మళ్లీ కండరాల నొప్పులు, దద్దుర్లు, తలనొప్పి, మగత లాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి బాధలు లేకుండా, ఎలాంటి వ్యతిరేక ప్రభావాలు లేకుండా శరీరంలోని అదనపు ద్రవాలు, సోడియం బయటకు వెళ్లాలంటే ఈ కింది చిట్కాలు పాటించవచ్చు-
- తాగే నీరుకి కొన్ని చుక్కలు నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసంలో శరీరానికి మేలుచేసే లక్షణాలు చాలా ఉన్నాయి. అలాగే ఇది అదిక రక్తపోటుని నివారిస్తుంది కూడా.
- అల్లంలో శరీరంలోని అదనపు ద్రవాలు, విషపదార్థాలను బయటకు తోసే శక్తి ఉంది. దీన్ని ఆహారంతో పాటు కానీ, నేరుగా గానీ తీసుకోవచ్చు.
- క్యాబేజి మూత్రవిసర్జన సాపీగా జరిగేందుకు తోడ్పడుతుంది. ఇది గుండెకు కూడా ఎంతో మంచిది. శరీరంలో అదనంగా ఉన్న సోడియంని బయటకు పంపడంలో క్యాబేజి చాలాబాగా పనిచేస్తుంది.
- టమాటాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఈ సమస్యకు పరిష్కారంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంటు గుండె జబ్బుపై కూడా పోరాడగలుగుతుంది.
- శరీరంలోని అదనపు ద్రవాలను బయటకు పంపడంలో వెల్లుల్లి కూడా చాలాబాగా పనిచేస్తుంది. అదనపు ద్రవాలు బయటకు వెళ్లిపోతే అవి రక్తంలో చేరకుండా ఉంటాయి. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వెల్లుల్లి రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుందని అంటారు.
- నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోస కూడా మూత్ర విసర్జనను సాఫీ చేస్తుంది. ఇందులో నీరే కాదు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.