Telugu Global
National

చొక్కాలు విప్పి...చావ‌బాదారు!

రాజ‌స్థాన్‌లోని చిట్టూర్‌గ‌ర్‌లో ముగ్గురు టీనేజి బాలుర‌కు చొక్కాలు విప్ప‌దీయించి, వారి వీపుల‌పై చావబాదారు. ఒక అగ్ర‌వ‌ర్ణానికి చెందిన వ్య‌క్తి మోటార్ సైకిల్‌ని ఆ పిల్ల‌లు దొంగ‌లించార‌నే అభియోగంలో ఈ ప‌నిచేశారు. ఎన్‌డిటివి విడుద‌ల చేసిన వీడియోలో పిల్ల‌లు చొక్కాలు లేని వీపుల‌తో వ‌రుస‌గా కూర్చుని, భ‌యంతో వ‌ణికిపోతూ ఉండ‌టం, వారిని కొడుతుండ‌టం క‌న‌బ‌డుతోంది. మ‌రొక వార్తాప‌త్రిక త‌న క‌థ‌నంలో ఆ బాలుర‌ను చెట్టుకి క‌ట్టేసి కొట్టి, త‌రువాత అంతా చూస్తుండ‌గా అలా కూర్చోబెట్టార‌ని పేర్కొంది. ఈ మొత్తం […]

చొక్కాలు విప్పి...చావ‌బాదారు!
X

రాజ‌స్థాన్‌లోని చిట్టూర్‌గ‌ర్‌లో ముగ్గురు టీనేజి బాలుర‌కు చొక్కాలు విప్ప‌దీయించి, వారి వీపుల‌పై చావబాదారు. ఒక అగ్ర‌వ‌ర్ణానికి చెందిన వ్య‌క్తి మోటార్ సైకిల్‌ని ఆ పిల్ల‌లు దొంగ‌లించార‌నే అభియోగంలో ఈ ప‌నిచేశారు. ఎన్‌డిటివి విడుద‌ల చేసిన వీడియోలో పిల్ల‌లు చొక్కాలు లేని వీపుల‌తో వ‌రుస‌గా కూర్చుని, భ‌యంతో వ‌ణికిపోతూ ఉండ‌టం, వారిని కొడుతుండ‌టం క‌న‌బ‌డుతోంది. మ‌రొక వార్తాప‌త్రిక త‌న క‌థ‌నంలో ఆ బాలుర‌ను చెట్టుకి క‌ట్టేసి కొట్టి, త‌రువాత అంతా చూస్తుండ‌గా అలా కూర్చోబెట్టార‌ని పేర్కొంది.

ఈ మొత్తం ఉదంతంలో పోలీసులు బాలుర‌ను కొట్టిన వ్య‌క్తిని గురించి ప‌ట్టించుకోకుండా ఆ ముగ్గురిపై మాత్రం దొంగ‌త‌నం కేసుని న‌మోదు చేశారు. అది కూడా మీడియా ద్వారా ఈ అకృత్యం బ‌య‌ట‌కు రావ‌డంతో అప్పుడు పోలీసులు స్పందించారు. అయితే దెబ్బలు తిన్న పిల్ల‌లు త‌మ‌ని కొట్టిన‌వారెవ‌రో గుర్తించ‌లేక‌పోయార‌ని అందుకే గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు అంటూ కేసుని న‌మోదు చేశామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

Click on Image to Read:

5eaa7b3e-f096-4ce2-bd70-d8594018f1b6

TDP MLC Buddha Venkanna

jagan1

cbn-panama-1

global-hospital

satishreddy MLC

jagan

trs-bjp

ambati

T-Congress

First Published:  5 April 2016 11:30 AM IST
Next Story