ప్రత్యూష మరణం వెనుక ఓ మహిళ ....?!
సాధారణంగా హత్య, ఆత్మహత్య, ప్రమాదాలు ఇలాంటి ఘటనల్లో అందుకు సంబంధించిన విషయాలు తెలిసినవారు ఎవరూ ముందుకు వచ్చి పోలీసులకు సహకరించరు. కానీ టివినటి ప్రత్యూష బెనర్జీ విషయంలో ఆమె స్నేహితులు, సన్నిహితులు, సహనటులు బాగా స్పందిస్తున్నారు. తమ ఆవేదనని చాలా ఓపెన్‌గా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పదిమంది ఆమె సన్నిహితులు పోలీసులకు సహకరించేందుకు తమకు తెలిసిన వివరాలు తెలియజేసేందుకు ముందుకు వచ్చారు. వీరంతా ప్రత్యూషకు చాలా సన్నిహితులు. వీరు తమకు తెలిసిన అన్ని విషయాలను పోలీసులకు తెలిపేందుకు […]
సాధారణంగా హత్య, ఆత్మహత్య, ప్రమాదాలు ఇలాంటి ఘటనల్లో అందుకు సంబంధించిన విషయాలు తెలిసినవారు ఎవరూ ముందుకు వచ్చి పోలీసులకు సహకరించరు. కానీ టివినటి ప్రత్యూష బెనర్జీ విషయంలో ఆమె స్నేహితులు, సన్నిహితులు, సహనటులు బాగా స్పందిస్తున్నారు. తమ ఆవేదనని చాలా ఓపెన్‌గా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పదిమంది ఆమె సన్నిహితులు పోలీసులకు సహకరించేందుకు తమకు తెలిసిన వివరాలు తెలియజేసేందుకు ముందుకు వచ్చారు. వీరంతా ప్రత్యూషకు చాలా సన్నిహితులు. వీరు తమకు తెలిసిన అన్ని విషయాలను పోలీసులకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని న్యాయవాది ఫల్గుని బ్రహ్మభట్ అన్నారు. అయితే ఆ పదిమంది పేర్లు బయటకు చెప్పేందుకు ఫల్గుని నిరాకరించారు. వారికి ఇతరత్రా ఇబ్బందులు ఎదురుకాకుండా వారి పేర్లను గోప్యంగా ఉంచారు.
ప్రత్యూష గత శుక్రవారం తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యూష సన్నిహితులు కామ్యా పంజాబీ, అదాఖాన్, వికాస్ గుప్తా ఆమె మరణానికి దారితీసే అవకాశం ఉన్న పలు విషయాలను పోలీసులకు వెల్లడించారు. అందులో రాహుల్ రాజ్‌తో ఆమెకు ఉన్న గొడవలు, ఆమెకు అనుభవిస్తున్న హింస, మానసిక క్షోభ, డబ్బు విషయంలో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు, రాహుల్ రాజ్ మాజీ ప్రియురాలు ప్రత్యూషని వేధించడం….తదితర అంశాలున్నాయి. ఆమె ఆత్మహత్య వెనుక ఒక స్త్రీ ప్రమేయం ఉందనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. మరో పక్క ప్రత్యూష ముక్కు, కన్ను వద్ద గాయాలు ఉన్నాయని, ఇది ఆత్మహత్యకాదు, హత్యేనని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. టివి రంగానికి చెందిన వారు చాలామంది ప్రత్యూష ఎంతో మనోస్థయిర్యం ఉన్న అమ్మాయి అని, ఆమె ఇలా తన జీవితాన్ని అంతం చేసుకుందంటే నమ్మలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో స్పందించారు.