కాంగ్రెస్, టీడీపీలు డుమ్మా విద్యార్థులా?
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నీటి ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తప్పుబడుతున్న కాంగ్రెస్- టీడీపీలపై నిజామాబాద్ ఎంపీ కవిత తనదైన శైలిలో చురకలంటించారు. క్లాసులో కొందరు విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కారు, తీరా పరీక్షలు వచ్చేసరికి ఏదో సాకు చెప్పి ఎగ్గొడతారు. పైగా తిరిగి టీచర్లనే నిందిస్తారు.. టీడీపీ- కాంగ్రెస్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందని కవిత విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు ఆహ్వానించినప్పటికీ అసెంబ్లీకి రాకుండా పారిపోయి.. కేసీఆర్‌పై విమర్శలు చేయడం సరికాదని […]
BY admin5 April 2016 4:44 AM IST
X
admin Updated On: 5 April 2016 4:44 AM IST
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నీటి ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తప్పుబడుతున్న కాంగ్రెస్- టీడీపీలపై నిజామాబాద్ ఎంపీ కవిత తనదైన శైలిలో చురకలంటించారు. క్లాసులో కొందరు విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కారు, తీరా పరీక్షలు వచ్చేసరికి ఏదో సాకు చెప్పి ఎగ్గొడతారు. పైగా తిరిగి టీచర్లనే నిందిస్తారు.. టీడీపీ- కాంగ్రెస్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందని కవిత విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు ఆహ్వానించినప్పటికీ అసెంబ్లీకి రాకుండా పారిపోయి.. కేసీఆర్‌పై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ పునర్నిర్మాణంలో సూచనలు చేయాలని, వాటిని స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కోరినా.. వినకుండా విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకాలం అధికారంలో ఉన్నపుడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఎందుకు దృష్టి పెట్టలేదని నిలదీశారు. జలయజ్ఞం పేరుతో ఇష్టానుసారంగా ప్రజాధనం దోచుకోవడం తమ పద్ధతి కాదని కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ గురించి నోరెత్తని వారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎగతాళి చేశారు.
Next Story