దారుణం, ఆస్పత్రి నిర్వాకం… మొబైల్ సిగ్నల్స్‌తో గుట్టురట్టు
ఒక వ్యక్తికి చిన్నపాటి ఆపరేషన్ చేయాలన్నా అతడికి సంబంధించిన తల్లిదండ్రులు లేక అతడికి కావాల్సిన వారి అనుమతి ఉండాలి. అత్యవసర కేసుల్లో మినహా మిగిలిన ఆపరేషన్లకు ఈ నిబంధన తప్పక పాటించాలని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్ లక్డికపూల్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి నిబంధనలను తుంగలో తొక్కింది. నిబంధనలు తుంగలో తొక్కడమే కాదు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విషయం ఏమిటంటే నిఖిల్ రెడ్డి అనే 23ఏళ్ల యువకుడు హైట్ తక్కువగా ఉన్నానని మనోవేదనకు […]
ఒక వ్యక్తికి చిన్నపాటి ఆపరేషన్ చేయాలన్నా అతడికి సంబంధించిన తల్లిదండ్రులు లేక అతడికి కావాల్సిన వారి అనుమతి ఉండాలి. అత్యవసర కేసుల్లో మినహా మిగిలిన ఆపరేషన్లకు ఈ నిబంధన తప్పక పాటించాలని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్ లక్డికపూల్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి నిబంధనలను తుంగలో తొక్కింది. నిబంధనలు తుంగలో తొక్కడమే కాదు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విషయం ఏమిటంటే నిఖిల్ రెడ్డి అనే 23ఏళ్ల యువకుడు హైట్ తక్కువగా ఉన్నానని మనోవేదనకు గురయ్యేవాడు. దీంతో ఇటీవల డాక్టర్లను సంప్రదించాడు.
ఎత్తు పెరిగే మార్గం చెప్పాలని కోరాడు. అయితే ఇదే అదనుగా కాసులకు కక్కుర్తిపడిన ఆస్పత్రి సిబ్బంది… మందులతో పని జరగదని ఆపరేషన్ చేస్తే హైట్ పెరుగుతావని నమ్మించారు. దీంతో ఎలాగైనా హైట్ పెరగాలనుకున్న నిఖిల్ రెడ్డి ఇంట్లో పెద్దలకు చెప్పకుండా నాలుగు లక్షలు తీసుకొచ్చాడు. ఆపరేషన్ చేయాల్సిందిగా కోరాడు. అంతే చేతిలో డబ్బులు పడేసరికి ఆస్పత్రి సిబ్బందికి నిబంధనలు కనిపించలేదు. తీసుకెళ్లి ఆపరేషన్ మొదలుపెట్టారు. రెండు కాళ్లను కట్ చేసి హైట్ పెరిగే ఆపరేషన్ చేసేశారు. ఈ విషయం నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులకు కూడా తెలియజేయలేదు.
రెండు రోజులుగా తమ కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌టవర్ ఆధారంగా నిఖిల్ రెడ్డి గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్నట్టుగా గుర్తించారు. తమ కుమారుడు ఆస్పత్రిలో ఎందుకున్నాడో అర్ధం కాక నిఖిల్ తల్లిదండ్రులు ఆందోళనతో అక్కడి వచ్చారు. అప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టారు డాక్టర్లు. వెంటనే ఆపరేషన్ నిలిపివేయాలని కోరగా వీలుకాదన్నారు. ఒకకాలికి ఇప్పటికే ఆపరేషన్ పూర్తయిందని … మరో కాలికి ఆపరేషన్ చేయకుండా ఆపడం వీలుకాదని తేల్చేశారు. దాదాపు ఏడు గంటల పాటు నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులను బయటే ఉంచారు. నిఖిల్ రెడ్డి హైట్ 5.7 అడుగులు. మరో మూడు ఇంచులు పెంచేందుకు ఆపరేషన్‌కు చేశామని చెప్పారు. పెద్దవాళ్ల అనుమతి లేకుండా ఆపరేషన్ ఎలా చేస్తారని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
నిఖిల్ రెడ్డి అనుమతితోనే ఆపరేషన్ చేశామంటున్నారు. అయితే హైట్ గ్రో ఆపరేషన్లు చేయవద్దని కోర్టులు కూడా చెప్పాయంటున్నారు. ఈ ఆపరేషన్లు చాలా వరకు విఫలమయ్యాయని చెబుతున్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత నడవడానికి 9 నెలల సమయం పడుతుందంటున్నారు. 23 ఏళ్ల యువకుడు, చదువుకుంటున్న టైమ్ లో 9 నెలల పాటు ఇంటికే పరిమితం అయితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
Click on Image to Read: