ఇలా చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ ను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సమర్ధంగా ఎదుర్కోలేకపోతోందా? 2019లోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా లేదా? ఇవి ఇంకెవరి అభిప్రాయాలో అనుకోకండి.. తెలంగాణలో ప్రస్తుత పార్టీ పరిస్థితిపై సాక్షాత్తూ.. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న తీరు ఇది. రాష్ట్ర నాయకుల పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండేళ్లు పూర్తికావొస్తోంది. ఇంతవరకూ ప్రభుత్వ వైఫల్యాలను […]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ ను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సమర్ధంగా ఎదుర్కోలేకపోతోందా? 2019లోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా లేదా? ఇవి ఇంకెవరి అభిప్రాయాలో అనుకోకండి.. తెలంగాణలో ప్రస్తుత పార్టీ పరిస్థితిపై సాక్షాత్తూ.. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న తీరు ఇది. రాష్ట్ర నాయకుల పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండేళ్లు పూర్తికావొస్తోంది. ఇంతవరకూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సఫలీకృతం కాలేదు. అసలు ప్రతిపక్షం ఉనికే కనుమరుగవుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన దాదాపు అన్ని ఎన్నికలు, ఉప ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. కనీసం సొంతపార్టీ ఎమ్మెల్యే చనిపోయినా.. ఆ స్థానాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.
తెలంగాణ రాష్ట్రన్ని ఏర్పాటు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మడం లేదన్నదానిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ న్యూఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఇకపై క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానాన్ని కలవనున్నాడని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు… తెలంగాణ పీసీసీని గ్రామస్తాయి నుంచి పూర్తిగా ప్రక్షాళన చేయాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలిసింది. గ్రామ, మండల,డీసీసీలకు కొత్త కమిటీలను నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తీవ్ర సమస్యలైన కరువు, తాగునీరు, పశుగ్రాసం, వ్యవసాయ సంక్షోభంలపై నాయకులకు శిక్షణ ఇచ్చి జనాల్లోకి పంపనున్నారు. దీనికితోడు బీహార్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఎన్నికల ముందునుండి వెనకుండి ఎన్నో వ్యూహాలు నిర్మించి సహకరించిన ప్రశాంత్ కిషోర్ సహాయసహకారాలు తీసుకునే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రంలో బీజేపి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలున్నట్టుగా చెబుతుంటారు.
Click on Image to Read: