Telugu Global
NEWS

పనామా జాబితాలో చంద్రబాబు?

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ కొత్త ఆరోపణ చేస్తోంది.  విదేశాల్లో డబ్బు దాచిన బడాబాబుల సంగతులను బయటపెడుతున్న పనామా పేపర్‌ జాబితాలో చంద్రబాబు పేరు కూడా ఉందంటోంది. త్వరలోనే చంద్రబాబు పేరును పనామా జాబితాలో వినబోతున్నామని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పనామా జాబితా నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకు సాధ్యం కాదన్నారు.  విదేశాల్లో నల్లధనం దాచిన వారి జాబితాలో  వందలాది మంది భారతీయులు ఉన్నట్టు పనామా పేపర్ ప్రకటించింది. తీగ లాగాక డొంక కదలక మానదని ఆమె […]

పనామా జాబితాలో చంద్రబాబు?
X

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ కొత్త ఆరోపణ చేస్తోంది. విదేశాల్లో డబ్బు దాచిన బడాబాబుల సంగతులను బయటపెడుతున్న పనామా పేపర్‌ జాబితాలో చంద్రబాబు పేరు కూడా ఉందంటోంది. త్వరలోనే చంద్రబాబు పేరును పనామా జాబితాలో వినబోతున్నామని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పనామా జాబితా నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకు సాధ్యం కాదన్నారు. విదేశాల్లో నల్లధనం దాచిన వారి జాబితాలో వందలాది మంది భారతీయులు ఉన్నట్టు పనామా పేపర్ ప్రకటించింది. తీగ లాగాక డొంక కదలక మానదని ఆమె అన్నారు.

పనామా జాబితా నుంచి తప్పించుకోవడం అంటే సాంకేతిక కారణాలతో కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్నంత ఈజీ కాదన్నారామె. వాచీ లేదు ఉంగరం లేదంటున్న చంద్రబాబు సంగతి త్వరలోనే బయటకొస్తుందన్నారు. అప్పుడు చంద్రబాబు పక్కన ఒక్క వ్యక్తి కూడా నిలబడరని ఆ రోజులు ఎంతోదూరం లేదన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని తెహల్కా పత్రిక ఎప్పుడో తేల్చి చెప్పిందన్నారు వాసిరెడ్డి పద్మ. నల్లధనంపై చర్చ జరిగిన ప్రతిసారి చంద్రబాబు పేరు తెరపైకి వస్తోందన్నారు. చూడాలి వాసిరెడ్డి పద్మ చెప్పినట్టు నిజంగా పనామా జాబితాలో బాబు పేరు ఉంటుందో లేదో!.

Click on Image to Read:

jagan

5eaa7b3e-f096-4ce2-bd70-d8594018f1b6

jagan1

trs-bjp

T-Congress

satishreddy MLC

jagan-raghuveera

ambati

rayoal

saritha-nair

nehru

aishu

india-map

First Published:  5 April 2016 9:00 AM IST
Next Story