బన్నీకి అక్కడేం పని ?
సరైనోడు సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో శరవేగంగా సాగుతోంది. ఇలాంటి టైమ్ లో బన్నీ ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే… ఎవరైనా ఏ రికార్డింగ్ స్టుడియోలోనో… ఎడిట్ రూమ్ లోనో ఉన్నారని అనుకుంటారు. కానీ బన్నీ మాత్రం అందరికీ షాకిచ్చాడు. ఓవైపు సరైనోడు సినిమా రిలీజ్ కు సిద్ధమౌతుంటే…. అల్లు అర్జున్ మాత్రం దుబాయ్ లో ప్రత్యక్షమయ్యాడు. భార్య స్నేహ, కొడుకు అయాన్ తో కలిసి దుబాయ్ చెక్కేసి, అక్కడ ఓ ఫొటో దిగి మరీ సోషల్ నెట్ […]
సరైనోడు సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో శరవేగంగా సాగుతోంది. ఇలాంటి టైమ్ లో బన్నీ ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే… ఎవరైనా ఏ రికార్డింగ్ స్టుడియోలోనో… ఎడిట్ రూమ్ లోనో ఉన్నారని అనుకుంటారు. కానీ బన్నీ మాత్రం అందరికీ షాకిచ్చాడు. ఓవైపు సరైనోడు సినిమా రిలీజ్ కు సిద్ధమౌతుంటే…. అల్లు అర్జున్ మాత్రం దుబాయ్ లో ప్రత్యక్షమయ్యాడు. భార్య స్నేహ, కొడుకు అయాన్ తో కలిసి దుబాయ్ చెక్కేసి, అక్కడ ఓ ఫొటో దిగి మరీ సోషల్ నెట్ వర్కింగ్ లో పెట్టాడు. దీంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంత సడెన్ గా బన్నీకి దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆరాలు తీశారు. మేటర్ ఏంటంటే…. ఈరోజు అయాన్ పుట్టినరోజు. ఈ బర్త్ డేను దుబాయ్ లో సెలబ్రేట్ చేయాలని బన్నీ ముందే డిసైడ్ అయ్యాడట. అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడట. అందుకే ఇలా దుబాయ్ లో ప్రత్యక్షమయ్యాడు.