భారతమాతకి జై కొట్టకపోతే అడ్మిషన్ లేదు!
యోగాగురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకి జై వివాదంపై స్పందించిన యోగా గురు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమకు దేశంలోని రాజ్యాంగం, చట్టంపై గౌరవం ఉందని… అందుకే శాంతియుతంగా ఉన్నామని చెప్పారు. లేకుంటే భారత్ మాతాకీ జై అనని వారి తలలు నరికేసేవాడినని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రామ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టం మీద గౌరవంతోనే ఆగిపోయామని లేకుంటే వేలు కాదు లక్షల తలలు నరికేవారిమన్నారు. మరోవైపు […]
యోగాగురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకి జై వివాదంపై స్పందించిన యోగా గురు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమకు దేశంలోని రాజ్యాంగం, చట్టంపై గౌరవం ఉందని… అందుకే శాంతియుతంగా ఉన్నామని చెప్పారు. లేకుంటే భారత్ మాతాకీ జై అనని వారి తలలు నరికేసేవాడినని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రామ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టం మీద గౌరవంతోనే ఆగిపోయామని లేకుంటే వేలు కాదు లక్షల తలలు నరికేవారిమన్నారు.
మరోవైపు గుజరాత్, అమ్రెలీలోని శ్రీ పటేల్ విద్యార్థి ఆశ్రమ ట్రస్టు నిర్వాహకులు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తాము నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకునేవారు తప్పనిసరిగా అప్లికేషన్ మీద భారత్‌మాతాకి జై..అని రాయాల్సి ఉంటుందనే నిబంధన పెట్టారు. ఈ ట్రస్టుని గుజరాత్ బిజెపి నాయకుడు దిలీప్ సంఘానీ నిర్వహిస్తున్నారు. భారత్‌మాతాకీ జై అని రాయకపోతే సీటు రాదని ట్రస్టు నిర్వాహకులు తెల్చి చెప్పేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక ప్రైమరీ స్కూలు, రెండు ఉన్నత పాఠశాలలు, ఒక కాలేజి ఉన్నాయి. మొత్తం 4,500మంది వీటిలో చదువుతున్నారు. 104ఏళ్ల తమ ట్రస్ట్, విద్యార్థుల్లో జాతీయతా భావాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుందని దిలీప్ సంఘానీ అంటున్నారు. అయితే కొన్నాళ్లుగా బిజెపిలో తన ప్రాధాన్యత తగ్గిన క్రమంలో, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయ్ రూపానీ, సంఘానీని పక్కన పెట్టిన నేపథ్యంలో తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చేందుకే సంఘానీ ఈ ఎత్తువేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.