రోడ్డుమీది జీబ్రా గీతలు...గోడలై పోతే!
రోడ్డు ప్రమాదాలు మితిమీరి పోతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళలు ఈ ప్రమాదాల నివారణకు పనికొచ్చే ఒక కొత్త ఆలోచన చేశారు. అహ్మదాబాద్‌లో వీరి ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చారు. శకుంతల పాండ్య, సౌమ్యా పాండ్య టక్కర్… అనే వీరిద్దరూ తల్లీ కూతుళ్లు. రోడ్డుమీద ట్రాఫిక్ నియంత్రణకోసం గీసే జీబ్రాలైన్లను వీరు 3డి ఆర్ట్ విధానంలో గీస్తున్నారు. దీనివలన చూసేవారికి అవి నేలమీద గీసిన గీతలుగా కాక, రోడ్డుమీద అడ్డంగా నిలబెట్టిన గోడల్లా కనబడుతున్నాయి. అహ్మదాబాద్‌లో ఈపద్ధతిని ప్రయోగించి చూశారు. ఇది బాగా పనిచేసినట్టుగా ట్రాఫిక్ […]
రోడ్డు ప్రమాదాలు మితిమీరి పోతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళలు ఈ ప్రమాదాల నివారణకు పనికొచ్చే ఒక కొత్త ఆలోచన చేశారు. అహ్మదాబాద్‌లో వీరి ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చారు. శకుంతల పాండ్య, సౌమ్యా పాండ్య టక్కర్… అనే వీరిద్దరూ తల్లీ కూతుళ్లు. రోడ్డుమీద ట్రాఫిక్ నియంత్రణకోసం గీసే జీబ్రాలైన్లను వీరు 3డి ఆర్ట్ విధానంలో గీస్తున్నారు. దీనివలన చూసేవారికి అవి నేలమీద గీసిన గీతలుగా కాక, రోడ్డుమీద అడ్డంగా నిలబెట్టిన గోడల్లా కనబడుతున్నాయి. అహ్మదాబాద్‌లో ఈపద్ధతిని ప్రయోగించి చూశారు. ఇది బాగా పనిచేసినట్టుగా ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. శకుంతల, సౌమ్య ఇద్దరూ ఆర్టిస్టులే. వీరిలో కూతురు అయిన సౌమ్య చిన్నతనం నుండే చిత్రకళలో శిక్షణ తీసుకుంది. ఈమె ఆరితేరిన 3డి స్ట్రీట్ ఆర్ట్ కళాకారిణి. 3డి స్ట్రీట్ ఆర్ట్ అనేది మన దేశానికి కొత్త అని, అందువలన అలాంటి డిజైన్లు చూసేవారికి కొత్తగా, ఉత్సాహభరితంగా అనిపిస్తాయని సౌమ్య తన ఫేస్‌బుక్‌లో పేర్కొంది.
అధికారుల అనుమతితో ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో తాము త్రీడి లైన్లు గీసినట్టుగా సౌమ్య తెలిపింది. ఇవి దూరం నుండే డ్రైవర్‌ని అప్రమత్తం చేస్తాయని. స్పీడు తగ్గించాలని హెచ్చరిస్తాయని ఆమె పేర్కొంది. అయితే చూసుకోకుండా వచ్చి, సడన్ బ్రేక్ వేయాల్సిన ప్రమాదం కూడా ఉండదని, దగ్గరగా వచ్చినపుడు అవి నేలమీద ఉన్నట్టుగా అర్ధమవుతుందని ఆమె చెప్పింది. అహ్మాదాబాద్‌లో సంబంధితఅధికారులు ఈ విధానాన్ని పూర్తిగా పరీక్షించారని, ఈ 3డి జీబ్రాలైన్లకు కాపీరైట్ తీసుకునే అవకాశం కూడా ఉందని వివరించింది. సౌమ్య ప్రకృతి ప్రేమికురాలు. ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధంపై చిత్రాలు గీసి అనేక ప్రదర్శనలు నిర్వహించింది. ఒక కళా కేంద్రాన్ని స్థాపించి పిల్లలకు , సీనియర్ సిటిజన్లకు చిత్రకళని నేర్పుతోంది. సౌమ్య గీసిన మరికొన్ని త్రిడీ ఆర్ట్ కళారూపాలను కూడా ఇక్కడ చూడవచ్చు.