అప్పులు మరీ అంత స్థాయికి చేరాయా?
కేసీఆర్ ప్రభుత్వంపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జల దృశ్యం పేరుతో సభలో కేసీఆర్ మయసభ సినిమా చూపించారన్నారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటున్న కేసీఆర్ ముందుగా 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులపై కేవలం ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే 30 లక్షల ఎకరాలకు నీరు వస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించి కాగ్ నివేదిక ఆందోళనకరమైన అంశాలను బయటపెట్టిందని రేవంత్ చెప్పారు. […]
కేసీఆర్ ప్రభుత్వంపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జల దృశ్యం పేరుతో సభలో కేసీఆర్ మయసభ సినిమా చూపించారన్నారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటున్న కేసీఆర్ ముందుగా 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులపై కేవలం ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే 30 లక్షల ఎకరాలకు నీరు వస్తాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించి కాగ్ నివేదిక ఆందోళనకరమైన అంశాలను బయటపెట్టిందని రేవంత్ చెప్పారు. కానీ ఆ విషయాలు ప్రచురితం కాకుండా పత్రికల, మీడియా సంస్థలపై కేసీఆర్ ఒత్తిడి తెస్తున్నారని రేవంత్ ఆరోపించారు . అత్యంత వేగంగా తెలంగాణ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతున్న విషయాన్ని కాగ్ వెల్లడించిందన్నారు.
ఇప్పటి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనలో 69 వేల కోట్ల అప్పు చేస్తే… కేసీఆర్ కేవలం 22నెలల పాలనలోనే తెలంగాణ అప్పును లక్షా 50 వేల కోట్లకు తీసుకెళ్లారని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తాము చెబుతున్నది కాదని కాగ్ నివేదికలోనే స్పష్టంగా ఉందన్నారు. మితిమీరిన అప్పులు తెలంగాణ సమాజాన్ని కబలించబోతున్నాయని కాగ్ ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.
గత పాలకుల కారణంగా తెలంగాణలో సాగునీటి రంగం దెబ్బతిన్నది చెబుతున్న కేసీఆర్ మరి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో భారీ నీటిపారుదల శాఖను నిర్వహించింది కడియం, తుమ్మలనే కదా అని రేవంత్ గుర్తు చేశారు. వారిద్దరు అసమర్ధులే అయితే ఎలా పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు.
Click on Image to Read: