లెక్కలు నచ్చని అమ్మాయిలు...అందమైన భర్తని కోరుకుంటారా?
అమ్మాయిలకు లెక్కలు, సైన్స్ అంటే ఇష్టముండదు…అనే కామెంట్ ఒకటి తరచుగా వినబడుతుంటుంది. దానిమీద పలు పరిశోధనలు అధ్యయనాలు జరుగుతున్నాయి. అందులో నిజం లేదని కూడా తేల్చాయి. ఆ విషయాన్ని పక్కనుంచితే లెక్కలు సైన్స్… ఈ రెండు సబ్జక్టులను ఇష్టపడని అమ్మాయిలు తెలివైన, అందమైన అబ్బాయిని జీవిత భాగస్వామిగా కావాలనుకుంటారని ఒక అధ్యయనంలో తేల్చారు. అమెరికాలో బఫెలో యూనివర్శిటీలో ఈ అధ్యయనం నిర్వహించారు. అప్లయిడ్ సోషల్ సైకాలజీ అనే పత్రికలో ఈ వివరాలు వెల్లడించారు. లెక్కలు, సైన్స్‌కి దూరంగా ఉండే అమ్మాయిలు తమకంటే తెలివైన, అందమైన అబ్బాయిలను […]
అమ్మాయిలకు లెక్కలు, సైన్స్ అంటే ఇష్టముండదు…అనే కామెంట్ ఒకటి తరచుగా వినబడుతుంటుంది. దానిమీద పలు పరిశోధనలు అధ్యయనాలు జరుగుతున్నాయి. అందులో నిజం లేదని కూడా తేల్చాయి. ఆ విషయాన్ని పక్కనుంచితే లెక్కలు సైన్స్… ఈ రెండు సబ్జక్టులను ఇష్టపడని అమ్మాయిలు తెలివైన, అందమైన అబ్బాయిని జీవిత భాగస్వామిగా కావాలనుకుంటారని ఒక అధ్యయనంలో తేల్చారు. అమెరికాలో బఫెలో యూనివర్శిటీలో ఈ అధ్యయనం నిర్వహించారు. అప్లయిడ్ సోషల్ సైకాలజీ అనే పత్రికలో ఈ వివరాలు వెల్లడించారు. లెక్కలు, సైన్స్‌కి దూరంగా ఉండే అమ్మాయిలు తమకంటే తెలివైన, అందమైన అబ్బాయిలను ఇష్టపడతారని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లోరా పార్క్ అంటున్నారు.
అందమైన, తెలివైన రొమాంటిక్ బాయ్‌ఫ్రెండ్‌ని కోరుకునే అమ్మాయిల్లో ఊహలు, కలలు ఎక్కువగా ఉంటున్నాయని, అలాంటి వారు లెక్కలు, సైన్స్ సబ్జక్టులకు దూరంగా ఉంటున్నారని ఈ అధ్యయనవేత్తలు తేల్చారు. 900మంది అమ్మాయిల మీద వీరు అధ్యయనం నిర్వహించారు. అమ్మాయిలతో పోల్చినపుడు అబ్బాయిల్లో తమ గర్ల్‌ఫ్రెండ్, కాబోయే భార్య గురించి అలాంటి కలలు తక్కువగా ఉండటం గమనించారు. అంతేకాదు, లెక్కలు, సైన్స్ పట్ల ఆసక్తి తక్కువగా ఉన్న అమ్మాయిలు, మరీ ఎక్కువగా సమానత్వం, హక్కుల గురించి మాట్లాడరని, వారు సమాజం నిర్దేశించిన మహిళల లక్షణాలతో బతికేయడానికి ఇష్టపడుతున్నారని కూడా అధ్యయనం తేల్చింది. తమ కాబోయే భాగస్వామి పట్ల అంతగా కలలు లేనివారే లెక్కలు, సైన్స్‌ల్లో రాణిస్తున్నారని కూడా లోరా పార్క్ అంటున్నారు.
మొత్తానికి ఇది కాస్త విచిత్రంగానే ఉన్నా ఇందులో లాజిక్ ఉంది. అందమైన, తెలివైన అబ్బాయి జీవిత భాగస్వామిగా కావాలనే కలలు మరీ ఎక్కువగా కనే అమ్మాయిలకు…అదే మొదటి కల కాదు… వారి ఆలోచనల తీరే అదని మనం గుర్తించాలి. అందమైన ఊహల్లో తేలటం వారికి చిన్నతనం నుండీ నచ్చిన విషయమన్న మాట. ఇక లెక్కలు, సైన్స్ విషయానికి వస్తే ఇవి పూర్తిగా ప్రాక్టికల్ అంశాలు. కలలు కనే తత్వంతో ఉన్నవారు ప్రాక్టికల్ అంశాలపట్ల అంత బలంగా ఉండలేరు. అదే ఇక్కడ వర్తిస్తున్నదనుకోవాలి. అంతేకానీ, చిన్నతనంలో లెక్కలు నచ్చడం లేదనే అమ్మాయిలు అప్పటినుండే రొమాంటిక్ బాయ్‌ఫ్రెండ్ గురించి కలలు కంటున్నారు అనలేము కదా…
మొత్తానికి ఇదంతా ఆలోచనల తీరుకి సంబంధించిన విషయం. సంప్రదాయబద్ధంగా కాకుండా కాస్త ముందుకువెళ్లి ఆలోచించగల అమ్మాయిలే లెక్కలు, సైన్స్ ల్లో రాణిస్తారు… అని కూడా మనం ఈ అధ్యయనానికి నిర్వచనం చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్ గా ఉంటూ అలాగే ఆలోచిస్తే, అమ్మాయిలకు సామాజిక ఆమోదం ఉండదు…అనే భయమున్న అమ్మాయిలు సాంప్రదాయబద్దంగానే ఉంటారు….వాస్తవానికి దూరం చేసే ఆ ఆలోచనా తీరే వారిలో లెక్కలు, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడం లేదని…అంతేకానీ వారిలో ఆ శక్తి లేక కాదని….కూడా మనం భావించవచ్చు.