పఠాన్‌కోట్ ఉగ్రదాడి దర్యాప్తు అధికారి దారుణహత్య!
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడులకు సంబంధించిన కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారి మహ్మద్ తంజిల్ దారుణహత్యకు గురయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ఈ అధికారి కుటుంబంతో పాటు శనివారం రాత్రి పెళ్లికి వెళ్లివస్తుండగా ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్ వద్ద దుండగులు కారుని ఆపారు. చాలా సమీపం నుండి కాల్పులు జరపటంతో తంజిల్ మృతి చెందగా, ఆయన భార్య గాయలపాలయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల పాక్‌నుండి సంయుక్త దర్యాప్తు బృందం భారత్‌కి వచ్చి పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ […]
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడులకు సంబంధించిన కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారి మహ్మద్ తంజిల్ దారుణహత్యకు గురయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ఈ అధికారి కుటుంబంతో పాటు శనివారం రాత్రి పెళ్లికి వెళ్లివస్తుండగా ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్ వద్ద దుండగులు కారుని ఆపారు. చాలా సమీపం నుండి కాల్పులు జరపటంతో తంజిల్ మృతి చెందగా, ఆయన భార్య గాయలపాలయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల పాక్‌నుండి సంయుక్త దర్యాప్తు బృందం భారత్‌కి వచ్చి పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ప్రాంతాలను పరిశీలించి వెళ్లిన సంగతి తెలిసిందే. పాక్ బృందం వైమానిక స్థావరంలో తిరిగే అనుమతుల విషయంలోనూ, మిగిలిన వ్యవహారాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కీలక పాత్ర పోషించింది. ఎన్ఐఎ లో తంజిల్ డిప్యుటీ ఎస్‌పి హోదాలో ఉన్నారు.