ఆయినా బుద్ధిరాలేదు.. మళ్ళీ వంచిచాడు.. కటకటాల పాలయ్యాడు..
గతేడాది దాదాపు 80 మంది విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి కటకటాల పాలైన ఓ ప్రబుద్ధుడు తిరిగి అదే కేసులో అరెస్టయ్యాడు. అబ్దుల్ మాజీద్… హైదరాబాద్‌లోని రోడ్నెం.10 సమీపంలో ఉన్న ఓ మురికివాడకు చెందిన యువకుడు. బీటెక్ విద్యార్థిగా చెలామణి అవుతూనే గతేడాది దాదాపు 80 మంది విద్యార్థినుల నగ్న చిత్రాలు, వీడియోలుఫేస్‌బుక్ ద్వారా సేకరించాడు. వాటిని బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారి నుంచి డబ్బు గుంజాడు. ఓ బాధితురాలు వీడి వేధింపులు భరించలేక పోలీసులకుఫిర్యాదు […]
గతేడాది దాదాపు 80 మంది విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి కటకటాల పాలైన ఓ ప్రబుద్ధుడు తిరిగి అదే కేసులో అరెస్టయ్యాడు. అబ్దుల్ మాజీద్… హైదరాబాద్‌లోని రోడ్నెం.10 సమీపంలో ఉన్న ఓ మురికివాడకు చెందిన యువకుడు. బీటెక్ విద్యార్థిగా చెలామణి అవుతూనే గతేడాది దాదాపు 80 మంది విద్యార్థినుల నగ్న చిత్రాలు, వీడియోలుఫేస్‌బుక్ ద్వారా సేకరించాడు. వాటిని బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారి నుంచి డబ్బు గుంజాడు. ఓ బాధితురాలు వీడి వేధింపులు భరించలేక పోలీసులకుఫిర్యాదు చేయడంతో..2015 సెప్టెంబరులో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఇలాంటి కేసులోనే ఓ అమ్మాయిని వేధించి డబ్బులు గుంజే ప్రయత్నంలో మరోసారి పోలీసులకుచిక్కాడు.
ఏం చేస్తాడు?
మాజిద్ ముందుగా అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరుస్తాడు. ఎవరికీ అనుమానం రాకుండా.. ఫొటోలు కూడా అమ్మాయివే పెడతాడు. డబ్బు ఉన్న విద్యార్థుల వివరాలుసేకరిస్తాడు. తనకు తాను సంపన్న వర్గానికి చెందిన అమ్మాయినంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు. వారు యాక్సెప్ట్ చేయడంతో మెల్లిగా చాటింగ్ మొదలు పెడతాడు. అవతలిఉంది అమ్మాయే కదా! అని వారు కూడా వీడి వలలో పడిపోతారు. మెల్లిగా వారిని మభ్య పెడతాడు. వారి నగ్న ఫొటోలు, వీడియోలు సేకరిస్తాడు. తరువాత వీడి అసలురూపం బయటపెడతాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. వీటిని నెట్‌లో పెడతానని బెదిరిస్తాడు. దీంతో చేసేది లేక వాడు అడిగినంత ఇస్తున్నారు. ఒకసారి ఇచ్చిన వారినివదలడం లేదు. పదేపదే వారినే బెదిరించి డబ్బులు గుంజుతున్నాడు. తాజాగా ఓ విద్యార్థిని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజిద్ వ్యవహారం మరోసారి వెలుగులోకివచ్చింది. వీడిపై ఫిర్యాదు చేస్తే.. ఎక్కడ పరువు పోతుందోనని బాధితులు ముందుకు రావడం లేదు. వీడి బారిన పడ్డ బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలనిహైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు.