రేవంత్ మౌనానికి.. జగన్ వ్యాఖ్యలకు సంబంధమేంటి?
ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. అధికార, ప్రతిపక్ష నేతలిద్దరూ ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం కొనసాగించారు. జగన్‌పై వ్యక్తిగతంగా దాడి చేసిన ఏపీ టీడీపీ నేతలు జగన్ పదే పదే చేసిన ఒక ఆరోపణకు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ ఆరోపణకు, తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మౌనానికి ఏదైనా.. సంబంధం ఉందా? అని ఇప్పుడు రెండు రాష్ర్టాల్లో రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు […]
BY admin3 April 2016 5:10 AM IST
X
admin Updated On: 3 April 2016 3:34 PM IST
ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. అధికార, ప్రతిపక్ష నేతలిద్దరూ ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం కొనసాగించారు. జగన్‌పై వ్యక్తిగతంగా దాడి చేసిన ఏపీ టీడీపీ నేతలు జగన్ పదే పదే చేసిన ఒక ఆరోపణకు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ ఆరోపణకు, తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మౌనానికి ఏదైనా.. సంబంధం ఉందా? అని ఇప్పుడు రెండు రాష్ర్టాల్లో రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే క్రమంలో వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ పలుమార్లు ఓటుకు నోటు కేసును ఉదహరించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి ఆయనకు కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేదని విమర్శించారు. అంతేనా.. ఆ విషయంలో తనను కాపాడమని కేంద్రం వద్ద సాగిలబడి ఏపీకి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారంటూ ధ్వజమెత్తారు.
అదే కారణమా?
ఇప్పుడు అవే వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఓటుకు నోటు కేసు నెమ్మదించడంతో టీడీపీ నేతలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి మౌనానికి ఇదే కారణమా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు కుంభకోణంలో అరెస్టయి జైలు నుంచి వచ్చాక.. కేసీఆర్‌పై వ్యక్తిగత మాటల దాడిని తీవ్రం చేశాడు రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులనూ వదల్లేదు. ఈ లోగా ఏమైందో ఏమో తెలియదు.. రేవంత్ చాలా నెమ్మదించాడు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం లేదు. కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నాడు. సభా సంప్రదాయాలు అంటూ కొత్త పలుకులు పలుకుతున్నాడు. జగన్ చేసిన ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేకపోతే.. దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి లో ఈ కొత్తకోణం ఏంటి? అని తెలుగు రాష్ర్టాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Next Story