జబర్దస్ట్ కు కోర్టు సమన్లు
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్ టీం… ఎంతలా నవ్వులు పంచుతుందో అంతే స్థాయిలో వివాదాస్పదం కూడా అవుతోంది. ఇందులో నటిస్తున్న నటులు ఇప్పటికే పలు వివాదాల్లో కూరుకుపోయారు. పోలీసు కేసుల వరకు కూడా కొన్ని వ్యవహారాలు వెళ్లాయి. తాజాగా ఈ షోపై కోర్టు కేసు కూడా పడింది. న్యాయ వ్యవస్థను అవమానిస్తూ జబర్దస్త్ లో ఓ స్కిట్ చేశారంటూ… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టులో కేసు దాఖలైంది. ఓ కామెడీ స్కిట్ లో…. భగవద్గీతపై ప్రమాణ చేయమంటే… […]
BY admin3 April 2016 4:06 AM IST

X
admin Updated On: 3 April 2016 4:06 AM IST
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్ టీం… ఎంతలా నవ్వులు పంచుతుందో అంతే స్థాయిలో వివాదాస్పదం కూడా అవుతోంది. ఇందులో నటిస్తున్న నటులు ఇప్పటికే పలు వివాదాల్లో కూరుకుపోయారు. పోలీసు కేసుల వరకు కూడా కొన్ని వ్యవహారాలు వెళ్లాయి. తాజాగా ఈ షోపై కోర్టు కేసు కూడా పడింది. న్యాయ వ్యవస్థను అవమానిస్తూ జబర్దస్త్ లో ఓ స్కిట్ చేశారంటూ… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టులో కేసు దాఖలైంది. ఓ కామెడీ స్కిట్ లో…. భగవద్గీతపై ప్రమాణ చేయమంటే… తోటి మహిలను నిమురుతూ డబుల్ మీనింగ్ వచ్చేలా నటించారని పిటిషన్ లో ఆరోపించారు. దీంతో పాటు న్యాయవ్యవస్థను కించపరిచేలా చేసిన మరికొన్ని వ్యాఖ్యల్ని కూడా గుర్తించారు. దీంతో కోర్టు… జబర్దస్త్ టీం అంతటికీ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.
Next Story