బీజేపీ మంత్రులను బయటకు పంపి బాబు పొలికేకలు
”రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. కేంద్రంపై ఇంకా ఒత్తిడి పెంచుతాం. అనుకున్నది సాధిస్తాం”. ఇది రెండేళ్లుగా చంద్రబాబు చెబుతున్న మాటలు. రెండేళ్ల తర్వాత కూడా ఇదే డైలాగ్. శనివారం కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ”మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ఏం చేసినా చేయకపోయినా పడిఉంటామ్ అనుకుంటున్నారా?. మనమేమి మన సొంతానికి నిధులు అడగడం లేదు . రాష్ట్రానికి […]
”రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. కేంద్రంపై ఇంకా ఒత్తిడి పెంచుతాం. అనుకున్నది సాధిస్తాం”. ఇది రెండేళ్లుగా చంద్రబాబు చెబుతున్న మాటలు. రెండేళ్ల తర్వాత కూడా ఇదే డైలాగ్. శనివారం కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
”మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ఏం చేసినా చేయకపోయినా పడిఉంటామ్ అనుకుంటున్నారా?. మనమేమి మన సొంతానికి నిధులు అడగడం లేదు . రాష్ట్రానికి రావాల్సినవే అడుగుతున్నాం. రెండేళ్లు గడిచిపోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను మీడియా పతాకస్థాయిలో ప్రచురించింది. చంద్రబాబు ఈ స్థాయిలో విరుచుకుపడే సరికి టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారట. అయితే వెంటనే చంద్రబాబు ”ఇంకా ఒత్తిడి పెంచుదాం. ఇంకో పదిసార్లు తిరుగుదాం. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూద్దాం” అనేశారు. దీంతో మళ్లీ అందరూ డల్ అయిపోయారు. ఇంకో పదిసార్లు తిరుగుదాం అనడం ద్వారా ఇంకో రెండేళ్లు ఎదరుచూద్దామని పరోక్షంగా చెప్పినట్టుగా ఉందని అభిప్రాయపడుతున్నారు. పైగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు బీజేపీ మంత్రుల సమక్షంలో అని ఉంటే ఆ లెక్క వేరే ఉండేది. కానీ..
కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత బీజేపీ మంత్రులు లేని సమయంలో టీడీపీ నేతల సమక్షంలో చంద్రబాబు ఈస్థాయిలో మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారట. ఇక్కడే పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగానే మోదీ ప్రభుత్వంపై పోరాడే ఉద్దేశమే ఉంటే బీజేపీ మంత్రుల సమక్షంలోనే కేబినెట్ భేటీలోనే ఈ తరహాలో చంద్రబాబు స్పందించి ఉండేవారంటున్నారు. కానీ కేబినెట్ భేటీలో మాత్రం నిధుల కోసం కేంద్రానికి లేఖ రాస్తాం అని చెప్పి సరిపెట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పోరాడుతున్నారన్న భావన జనంలో కలిగేలా చేసేందుకు అప్పుడప్పుడు నాలుగు గోడల మధ్య, టీడీపీ నేతల సమక్షంలో చంద్రబాబు ఇలా నిప్పులు కురిపిస్తుంటారని చెబుతున్నారు. మొత్తం మీద ”ఇంకా ఒత్తిడి పెంచుదాం… మరో పది సార్లు ఢిల్లీకి వెళ్దాం” అన్న మాటల వెనుక 2019 వరకు ఎదురుచూసి అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి స్పందిద్దాం అన్నట్టుగా బాబు తీరుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Click on Image to Read: