ఉత్తమ్‌కి షాకిచ్చిన వకుళాభరణం!
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. వరంగల్ ఎంపీ ఉప ఎన్నిక, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక, తరువాత గ్రేటర్ ఎలక్షన్లు.. ఇలా పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా ఘోర పరాజయం పాలైంది. మరోవైపు పార్టీలో సీనియర్- జూనియర్లను ఉత్తమ్ కలుపుకొని పోలేకపోతున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పైగా బీసీలు – రెడ్లకు అస్సలు పొసగడం లేదనే వాదనలు రోజురోజుకు బలపడుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా […]
BY admin2 April 2016 2:17 AM IST
X
admin Updated On: 2 April 2016 6:32 AM IST
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. వరంగల్ ఎంపీ ఉప ఎన్నిక, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక, తరువాత గ్రేటర్ ఎలక్షన్లు.. ఇలా పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా ఘోర పరాజయం పాలైంది. మరోవైపు పార్టీలో సీనియర్- జూనియర్లను ఉత్తమ్ కలుపుకొని పోలేకపోతున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పైగా బీసీలు – రెడ్లకు అస్సలు పొసగడం లేదనే వాదనలు రోజురోజుకు బలపడుతున్నాయి.
అధికార పార్టీకి అనుకూలంగా వ్యాసం రాశారనే కారణంతో.. టీపీసీసీ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్ కు టీపీసీసీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద టీపీసీసీ ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై ఘాటుగా స్పందించాడు.. వకుళాభరణం కృష్ణమోహన్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రూ.5 భోజనం బాగుందన్న జానారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డాడు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించాడు. గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్‌పై కొందరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు దాడి చేస్తే ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. వారు చేస్తే ఒప్పు.. నేను చేస్తే తప్పా..? అంటూ ఎదురు ప్రశ్ననే సమాధానంగా రాసి ఉత్తమ్‌కుమార్‌కు పంపారు. పాపం! ఉత్తమ్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా.. సొంత పార్టీలోని వారిని కలుపుకొని పోలేక సతమతమవుతున్నారని సొంతపార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.
Next Story