చిన్నారి పెళ్లికూతురు ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు
బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో ఆనందిగా ప్రేక్షకులను మెప్పించిన ప్రత్యుష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడింది. చిన్న ఆనంది అవికాగోర్ తరువాత ఆనంది పాత్రలో ప్రత్యూష బెనర్జీ నటించింది. శుక్రవారం సాయంత్రం తన ఫ్లాట్‌లో ఉరివేసుకున్న ప్రత్యూషని అంథేరిలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. రాహుల్ రాజ్ సింగ్ అనే యువకునితో ప్రేమలో ఉన్న ప్రత్యూష త్వరలో అతడిని వివాహం చేసుకోవాలని అనుకుంది. ఈ ఏడాది తాము పెళ్లి చేసుకోబోతున్నట్టుగావెల్లడించింది కూడా. అయితే […]
బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో ఆనందిగా ప్రేక్షకులను మెప్పించిన ప్రత్యుష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడింది. చిన్న ఆనంది అవికాగోర్ తరువాత ఆనంది పాత్రలో ప్రత్యూష బెనర్జీ నటించింది. శుక్రవారం సాయంత్రం తన ఫ్లాట్‌లో ఉరివేసుకున్న ప్రత్యూషని అంథేరిలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. రాహుల్ రాజ్ సింగ్ అనే యువకునితో ప్రేమలో ఉన్న ప్రత్యూష త్వరలో అతడిని వివాహం చేసుకోవాలని అనుకుంది.
ఈ ఏడాది తాము పెళ్లి చేసుకోబోతున్నట్టుగావెల్లడించింది కూడా. అయితే ఆ ప్రేమ విఫలం కావడమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. రాహుల్ రాజ్‌కి మరొక యువతితో నిశ్చితార్థం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కారణాలతోనే తీవ్రమైన మానసిక వేదనకు గురైన ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ప్రత్యూష, తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిందని సమాచారం.మరింత షాక్‌కి గరిచేసే విషయం ఏమిటంటే రాహుల్ రాజే ప్రత్యూషని ఆసుపత్రికి తీసుకువచ్చాడని. ఆమెను అక్కడ అప్పగించేసి అతను ఆమె ఫోన్ తీసుకుని పరారయినట్టుగా మరికొన్ని వర్గాలనుండి అందుతున్న సమాచారం. రాహుల్ రాజ్ తన ఫోన్‌ని స్విచ్ఛాఫ్ చేశాడని, పోలీసులు అతనికోసం గాలిస్తున్నారని తెలుస్తోంది.
బాలికా వధుగానే ఆమె తొలిసారి బుల్లితెరమీద కనిపించింది. చిన్న ఆనందిగా ఎంతగానో ఆకట్టుకున్న అవికాగోర్ తరువాత ప్రత్యూష అంతగానూ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. టివి పరిశ్రమలో కూడా అందరితో మంచి అనిపించుకుంటూ ఎంతోమంది స్నేహితులను సంపాదించుకుంది. ప్రత్యూషని చూడటానికి హిందీ టివి పరిశ్రమకి సంబంధించిన అనేక మంది ఆసుపత్రికి వచ్చారు. అందరూ ఒకటే మాట… షాక్‌లో ఉన్నామని. బాలికావధులో నటిస్తున్న సిద్దార్థ్ శుక్లా (శివ పాత్రధారి) మాట్లాడుతూ తాను కూడా చాలా కి గురయ్యానని, చాలా బాధాకరమని అన్నాడు.
బిగ్‌బాస్ షోలో ఆమెతో పాటు పాల్గొన్న సహనటులు ప్రత్యూషది ఆత్మహత్యా, హత్యా అన్నది తేల్చాలని పోలీసులను కోరుతున్నారు. ప్రత్యూష మరణం వెనుక రాహుల్ రాజ్ పాత్రమీద సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్, ప్రత్యూషలు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాలు నిర్వహించిన పవర్ కపుల్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వారు తాము ప్రేమలో ఉన్న సంగతిని పబ్లిక్‌గా చెప్పారు. ఆ షూటింగ్ సమయంలో కూడా వారి మధ్య ఉన్న ప్రేమని అందరికీ తెలిసేలా సన్నిహితంగా ఉన్నారని సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు. గతంలో ఒకసారి నలుగురు పోలీసులు తన ఇంట్లోకి వచ్చి తనని లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ప్రత్యూష ఆరోపణలు చేసింది. అప్పట్లో అవి సంచలనం సృష్టించాయి. బాలికా వధు తరువాత ఆమె హమ్ హై నా, సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ 7, ససురాల్ సిమార్ కా తదితర టివి షోలు, సీరియల్స్‌లో కనిపించింది. ఏదిఏమైనా మరొక నిండుజీవితం అర్ధంతరంగా, అర్థరహితంగా, అన్యాయంగా ముగిసిపోయింది.
రాహుల్ రాజ్‑సింగ్ తన కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడని ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కూతురు ప్రశాంతంగా ఉండేదని, రాహుల్ సింగ్ వచ్చాక హింసకు గురైందని కన్నీటిపర్యంతమయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాహుల్‑ను వదిలిపెట్టేది లేదని అన్నాడు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నానని ఆమె సోదరి రిషిత ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆ సమయంలో నేను టూషన్ క్లాస్‑లో ఉన్నాను. ఇంటికి తిరిగి వచ్చాక, అందరూ ఏడుస్తున్నారు. నా సోదరి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. ఆమె ఈ పని చేసుండదు’ అని రిషిత చెప్పింది.