నాగంకు గుండా.. కేసీఆర్‌కు జైలా?
కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ బచావో వేదిక వ్యవస్థాపకుడు నాగం జనార్ధనరెడ్డి మళ్లీ క్రియాశీలకం అయ్యారు. ఈసారి తెలంగాణ సీఎంపై భారీ సవాలు విసిరి మరీ వార్తల్లో నిలిచారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేస్తే.. తాను అరగుండు కొట్టించుకుంటానని శపథం చేశారు. శుక్రవారం ఈ విషయంపై ఆయన విలేకరుల సమావేశంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ అవలంబిస్తున్న ధోరణిని తప్పుబట్టారు. ఆయన తన స్వార్థం కోసం తప్పులు చేస్తున్నారని […]
BY admin2 April 2016 2:02 AM IST
X
admin Updated On: 3 April 2016 9:58 AM IST
కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ బచావో వేదిక వ్యవస్థాపకుడు నాగం జనార్ధనరెడ్డి మళ్లీ క్రియాశీలకం అయ్యారు. ఈసారి తెలంగాణ సీఎంపై భారీ సవాలు విసిరి మరీ వార్తల్లో నిలిచారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేస్తే.. తాను అరగుండు కొట్టించుకుంటానని శపథం చేశారు. శుక్రవారం ఈ విషయంపై ఆయన విలేకరుల సమావేశంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ అవలంబిస్తున్న ధోరణిని తప్పుబట్టారు. ఆయన తన స్వార్థం కోసం తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఇది ఎంతోకాలం సాగదని.. సీఎం కేసీఆర్ తప్పక జైలుకు వెళ్తాడని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రిపై ఈ స్థాయిలో గతంలో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి మాత్రమే సవాలు చేసేవాడు. ఎందుకో ఈ మధ్య కాస్త నెమ్మదించాడు. ఆ స్థానాన్ని భర్తీ చేసేలా నాగం వ్యవహరిస్తున్నారని పాత్రికేయులు అనుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్ జైలుకు వెళ్లకపోతే.. నాగం అరగుండు చేయించుకుంటారా? అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Next Story