హరికృష్ణ కోసమే వచ్చా… జగన్‌తోనే ఉంటా- కొడాలి నాని
కృష్ణా జిల్లా లబ్బిపేటలో జరిగిన ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరవడం చర్చనీయాంశమైంది. నందమూరి హరికృష్ణ, నాని ఇద్దరూ ఒకే కారులో రావడంతో అందరి దృష్టి అటు మళ్లింది. టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి, దేవినేని ఉమ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హరికృష్ణతో కలిసి కొడాలి నాని రావడంపై కార్యక్రమానికి హాజరైన వారు ఎవరికి తోచినట్టు వారు లెక్కలేసుకున్నారు. అయితే వీటిపై కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. హరికృష్ణ […]
కృష్ణా జిల్లా లబ్బిపేటలో జరిగిన ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరవడం చర్చనీయాంశమైంది. నందమూరి హరికృష్ణ, నాని ఇద్దరూ ఒకే కారులో రావడంతో అందరి దృష్టి అటు మళ్లింది. టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి, దేవినేని ఉమ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హరికృష్ణతో కలిసి కొడాలి నాని రావడంపై కార్యక్రమానికి హాజరైన వారు ఎవరికి తోచినట్టు వారు లెక్కలేసుకున్నారు. అయితే వీటిపై కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. హరికృష్ణ తనకు గురువులాంటి వారని ఆయన కోసమే ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణానికి హరికృష్ణ గతంలో ఎంపీ ల్యాడ్స్ నుంచి కోటి 65 లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. తాను హరితో కలిసి రావడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని.. అలాంటి ఊహగానాలు అవసరం లేదన్నారు. తన రాజకీయ జీవితం మొత్తం జగన్‌తోనే కొనసాగుతుందని నాని తేల్చిచెప్పారు.
హరికృష్ణ కూడా చాలా కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు కావాలనే ఆయనను దూరంగా పెట్టారని చెబుతుంటారు. తనయుడి రాజకీయ జీవితానికి ఎన్టీఆర్ పోటీ రాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారని చాలా మంది భావన. ఇటీవల ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సమయంలోనూ టీడీపీ నేతలు దగ్గరుండి థియేటర్లు దొరక్కుండా అడ్డుకోవడం అప్పట్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హరితో కలిసి కొడాలి నాని రావడం టీడీపీకి అనుకూలించే పరిణామమేమీ కాదన్న భావన వ్యక్తమవుతోంది.
Click on Image to Read: