సర్దార్ గబ్బర్ సింగ్ – పవన్ కళ్యాణ్ షో
విడుదల తేదీ : ఏప్రిల్ 8 రేటింగ్. 2/5 దర్శకత్వం : కె.ఎస్. రవీంద్ర (బాబీ) నిర్మాత : శరత్ మరార్, సునీల్ లుల్లా సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ నటీనటులు : పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’.. గత కొద్దికాలంగా అందరి నోళ్ళలో నానుతూ తెలుగునాట ఓ సంచలనంగా మారిపోయిన సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తారాస్థాయి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు […]
BY sarvi1 April 2016 4:55 AM IST
X
sarvi Updated On: 9 April 2016 6:12 AM IST
విడుదల తేదీ : ఏప్రిల్ 8
రేటింగ్. 2/5
దర్శకత్వం : కె.ఎస్. రవీంద్ర (బాబీ)
నిర్మాత : శరత్ మరార్, సునీల్ లుల్లా
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నటీనటులు : పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్
‘సర్దార్ గబ్బర్ సింగ్’.. గత కొద్దికాలంగా అందరి నోళ్ళలో నానుతూ తెలుగునాట ఓ సంచలనంగా మారిపోయిన సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తారాస్థాయి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి రిలీజ్‌కు ముందుదాకా బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమాగా ప్రచారం పొందిన ఈ సర్దార్, నిజంగానే ఆ స్థాయిలో ఉందా? చూద్దాం…
కథ :
మూడు రాష్ట్రాల సరిహద్దులను కలుపుకొని ఉన్న రత్తన్ పూర్ ప్రాంత నేపథ్యంలో నడిచే కథే ‘సర్దార్ గబ్బ సింగ్’. భైరవ్ సింగ్ (శరద్ కెల్కర్) అనే ఓ రాజకుటుంబానికి చెందిన నియంత రత్తన్ పూర్ ప్రాంతంలోని సహజ వనరులను అక్రమంగా చేజక్కించుకునేందుకు పన్నాగాలు పన్నుతుంటాడు. ఆ క్రమంలోనే ఎన్నో పంట భూములను అక్రమంగా సొంతం చేసుకొని ఓ ఊరినే నాశనం చేస్తాడు. ఇక అదే ప్రాంతంలో ఉండే మరో రాజకుటుంబంతో భరవ్‍కి ఓ శతృత్వం కూడా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితులున్న ఊరిని చక్కబెట్టేందుకు సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్) పోలీసాఫీసర్‍గా నియమితుడవుతాడు. ఇక సర్దార్ ఈ భైరవ్ సింగ్ ఆటలను ఎలా కట్టించాడు? రత్తన్ పూర్‌లో అతడికి పరిచయమైన రాజ కుమారి అర్షిని (కాజల్)తో అతడి ప్రేమ ఎటువైపు దారితీసిందీ? అర్షిని కుటుంబానికి, భైరవ్ సింగ్‍కి ఉన్న గొడవలేంటీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మొదట్నుంచీ అనుకున్నట్లే పవన్ కళ్యాణ్‌నే మేజర్ హైలైట్‍గా చెప్పుకోవచ్చు. పవన్ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ ఆయన అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. పవన్, సినిమా మొత్తాన్నీ తన కామెడీ టైమింగ్‍తో భుజాలపై మోసుకొని నడిపించారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్‌లో పవన్ ప్రయత్నించిన చిరు వీణ స్టెప్, ఫస్టాఫ్‍లో వచ్చే చిన్న చిన్న కామెడీ బిట్స్, కాజల్‍తో రొమాన్స్ ట్రాక్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చిపెడతాయి. ఇక కాజల్ కూడా ఈ సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. రాజకుమారిగా అందంగా కనిపించడంతో పాటు మంచి నటన కూడా కనబరిచింది. విలన్‍గా నటించిన శరద్ కెల్కర్ కూడా బాగా నటించాడు.
ఇక సినిమా పరంగా చూసుకుంటే రత్తన్ పూర్ పరిచయంతో మొదలయ్యే సన్నివేశాలు బాగున్నాయి. అదే విధంగా పాటలన్నీ సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇటు మాస్, అటు క్లాస్ రెండు రకాల పాటలూ సినిమాలో మంచి రిలీఫ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. తౌబ తౌబ ఫ్యాన్స్‍కి పండగ లాంటి పాట.
మైనస్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్ కు ఇమేజ్ పరంగా ఇతర హీరోలకంటే ఎక్కువ ఆశిస్తారు. సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం సీక్వెల్ కాకుండా.. స్ట్రయిట్ గా ఇప్పుడే మొదటి భాగం అనే విధంగా వస్తే..అది వేరుగా ఉండేది. కానీ గతంలో హీరష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో కథ క్లారీటిగా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథలో అంతర్భాంగా అన్ని మసాలా దినసులు చక్కగా అద్దడంతో బాక్సాపీస్ ను షేక్ చేసింది. కానీ సర్ధార్ గబ్బర్ సింగ్ విషయంలో కథ క్లారీటి లేక పోవడం మేజర్ డ్రా బ్యాక్ గా దెబ్బ కొట్టింది. అవసరమైన ఎమోషన్స్ లేక పోగా.. కొన్ని యాక్షన్ సీన్స్ అతి అనిపిస్తాయి. అదే గబ్బర్ సింగ్ చిత్రంలో తల్లి సెంటిమెంట్.. తండ్రి సెంటిమెంట్.. తమ్ముడి సెంటిమెంట్ కథను బలోపేతం చేసి ఆడియన్స్ ను కట్టి పడేస్తాయి. అటువంటి ఎలిమెంట్స్ ఏమి సర్ధార్ లో ఉండేలా రచయితగా పవన్ కళ్యాణ్ చూసుకోలేదు. కామెడి ఆధారం చేసుకుని.. కొన్ని యాక్షన్ సీన్స్ ను రాసుకుని వాటినే నమ్ముకుని బరిలోకి దిగడం నిరాశ పరిచని అంశమనే చెప్పాలి. ఆడియన్స్ ను ఎక్కడ నిరాశ పరచకుండ ఆద్యంతం నవ్విస్తూనే తన తడాఖా చూపాలన్నట్లు యాక్షన్స్ సిన్స్ సిద్దం చేసినట్లు తెలుస్తుంది కానీ.. కథ బలంగా లేనప్పుడు విరోచిత సన్నివేశాలు పడితే.. అభిమానులు కనెక్ట్ కావడం కష్టంగానే వుంటుంది.
ప్రతి నాయకుడు పాత్ర బాగా ఎస్టాబ్లీష్ చేసి.. చివరి వరకు విలన్ ను అదే స్థాయిలో నిలపలేక పోవడం మరో మైనస్ అనిపిస్తుంది. ప్రథమార్ధం కొంత వరకు పర్వాలేదనిపిస్తుంది. అయితే విజృంభించాల్సిన సెకండాఫ్ మాత్రం పూర్తిగా పట్టు తప్పింది.
టెక్నికల్ విభాగం…
సాంకేతిక అంశాల విషయానికి వస్తే, అందరికంటే ముందుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పుకోవాలి. దేవిశ్రీ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్‌లో ఒకరుగా నిలిచారు. ఆయన అందించిన ఆడియో ఇప్పటికే హిట్ కాగా, సినిమాలో విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఆ పాటలకు మరింత అందం వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ దేవిశ్రీ పనితనం బాగుంది. ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రత్తన్ పూర్ నేపథ్యాన్ని ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి తనదైన సెట్స్‌తో పట్టుకుంటే, ఆర్థర్ ఆ నేపథ్యాన్ని తన కెమెరాలో చక్కగా బంధించారు. ఎడిటింగ్ పనితనం పెద్దగా ఆకట్టుకునేలా లేదు.
ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే, పవన్ అందించిన అతిసాదా సీదా కథ, కథనాలతో బాబీ దర్శకుడిగానూ పెద్దగా చేసిందేమీ లేదు. కేవలం పవన్ చరిష్మాను మాత్రమే నమ్ముకున్న బాబీ, ఆ క్రమంలోనే కొన్ని అలాంటి సన్నివేశాలను అందించడంలో సఫలమైనా, దర్శకుడిగా మాత్రం చాలాచోట్ల నిరాశపరిచాడు. బాబీ దర్శకత్వ ప్రతిభను చూపే సన్నివేశాలు సినిమాలో పెద్దగా ఎక్కడా లేవు. పవన్ కళ్యాణ్ పాత్ర చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాల్లో బాబీ ప్రతిభ చూడొచ్చు. ఇక సాయిమాధవ్ బుర్రా అందించిన మాటలు బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. సరదాగా నవ్వించే కామెడీ, పవన్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్, పవన్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లాంటివి ప్రధానంగా ఆకట్టుకునే అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కూడా ఇవే అంశాలను నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాగా చెప్పుకోవాలి. అయితే సినిమా కథలో యాక్షన్ పేరు తో ఎక్కువ లోడు ఆడియన్స్ మీద వేయకూడదనే ఉద్దేశ్యం తో కథ రాసుకోవడంతో.. గ్రిప్ప్ పడాల్సిన చోట కూడా కథ తేలిపోయింది. గబ్బర్ సింగ్ లో లవ్ ట్రాక్ కూడా అద్భుతుంగా పండింది. పవన్ కళ్యాణ్, శృతిహాసన్ ల మధ్య కెమిస్ట్రి కూడా బాగా పండింది. సర్ధార్ గబ్బర్ సింగ్ లో లవ్ ట్రాక్ బలహీనంగా ఉంది. కాజల్ యాక్టింగ్ కు స్కోప్ పెద్దగా లేదు. వినోద పరంగా అయితే ఢోకాలేదు కానీ.. ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ కు ఆశించిన స్థాయిలో కథ లేక పోవడం లోపం. అయితే ఫ్యాన్స్ ను సినిమా డిజపాయింట్ చేయక పోవచ్చు. పవన్ కళ్యాణ్ కథ మీద మరింత బలంగా కసరత్తు చేస్తే బావుండేది మరి.
Next Story