గోవాలో సేదతీరిన మహేష్
సినిమాలతో పాటు కుటుంబానికి కూడా ప్రాధాన్యం ఇస్తుంటాడు మహేష్. నిత్యం షూటింగులతో బిజీగా ఉండే ప్రిన్స్, ఏమాత్రం గ్యాప్ దొరికినా కుటుంబంతో గడపడానికి ట్రైచేస్తుంటాడు. తాజాగా ఆ విషయం మరోసారి రుజువైంది. ఇటీవల ఉత్తరాదిన షూటింగ్ పూర్తిచేసుకొని వచ్చిన బ్రహ్మోత్సవం టీం… ఓ రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ లో తిరిగి మరోషెడ్యూల్ ప్రారంభించాలని అనుకుంటోంది. అనుకోకుండా 2 రోజులు గ్యాప్ దొరకడంతో వెంటనే ఫ్యామిలీ మేన్ అయిపోయాడు […]
BY sarvi1 April 2016 5:15 AM IST
X
sarvi Updated On: 1 April 2016 8:03 AM IST
సినిమాలతో పాటు కుటుంబానికి కూడా ప్రాధాన్యం ఇస్తుంటాడు మహేష్. నిత్యం షూటింగులతో బిజీగా ఉండే ప్రిన్స్, ఏమాత్రం గ్యాప్ దొరికినా కుటుంబంతో గడపడానికి ట్రైచేస్తుంటాడు. తాజాగా ఆ విషయం మరోసారి రుజువైంది. ఇటీవల ఉత్తరాదిన షూటింగ్ పూర్తిచేసుకొని వచ్చిన బ్రహ్మోత్సవం టీం… ఓ రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ లో తిరిగి మరోషెడ్యూల్ ప్రారంభించాలని అనుకుంటోంది. అనుకోకుండా 2 రోజులు గ్యాప్ దొరకడంతో వెంటనే ఫ్యామిలీ మేన్ అయిపోయాడు మహేష్. రెండు రోజుల్లో కుటుంబంతో కలిసి గోవా వెళ్లి వచ్చాడు. కొడుకు గౌతమ్, కూతురు సితార, భార్య నమ్రతతో కలిసి గోవాలో ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. ఆ ట్రిప్ కు సంబధించిన ఫొటోల్ని నమ్రత నెట్ లో కూడా పెట్టింది. రీఫ్రెష్ అయిన మహేష్ మళ్లీ రేపట్నుంచి బ్రహ్మోత్సవం సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు.
Next Story