వంతెన కట్టడమే కాదు...కూలిపోతే ఏం చేయాలో తెలియాలి!
మనకు ఇప్పటికీ అభివృద్ధి అనే పదానికి సరైన అర్థం తెలిసినట్టుగా లేదు. అత్యంత వేగంగా ఫ్లైఓవర్లు నిర్మించడమే కాదు, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎక్కువ ప్రాణహాని కలగకుండా సహాయక, రక్షణ చర్యలు తీసుకోగల సామర్ధ్యాన్ని పెంచుకోవడం కూడా అభివృద్ధే అవుతుంది. కోల్‌కతాలో వివేకానంద ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనలో వెనువెంటనే బాధితులను కాపాడే అవకాశం పోలీసులకు గానీ, ఫైర్ సిబ్బందికి గానీ, అక్కడ గుమిగూడిన ప్రజలకు గానీ లేకపోయింది. గురువారం 12.30కి జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు […]
మనకు ఇప్పటికీ అభివృద్ధి అనే పదానికి సరైన అర్థం తెలిసినట్టుగా లేదు. అత్యంత వేగంగా ఫ్లైఓవర్లు నిర్మించడమే కాదు, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎక్కువ ప్రాణహాని కలగకుండా సహాయక, రక్షణ చర్యలు తీసుకోగల సామర్ధ్యాన్ని పెంచుకోవడం కూడా అభివృద్ధే అవుతుంది. కోల్‌కతాలో వివేకానంద ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనలో వెనువెంటనే బాధితులను కాపాడే అవకాశం పోలీసులకు గానీ, ఫైర్ సిబ్బందికి గానీ, అక్కడ గుమిగూడిన ప్రజలకు గానీ లేకపోయింది. గురువారం 12.30కి జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది దుర్మరణం చెందారు. 88మంది గాయపడ్డారు. అయితే మృతులు 24 వరకు ఉండవచ్చని, శిధిలాల కింద 150 మంది వరకు చిక్కుకు పోయారని ప్రత్యక్ష్య సాక్ష్యులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన తరువాత దాదాపు రెండుగంటల వరకు అత్యవసర సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేకపోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తరువాత రెండుగంటల వరకు అక్కడకు గ్యాస్ కట్టర్లు గానీ, క్రేన్లు కానీ రాలేదు. 2.35గం.లకు ఒక ప్రయివేటు నిర్మాణ సంస్థ తమ వద్ద ఉన్న గ్యాస్ కట్టర్లు, రెండు క్రేన్లతో అక్కడకు వచ్చింది. 2.30గం.లకు పోలింగ్ విధుల్లో ఉన్న సెంట్రల్ రిజర్వు పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి అంబులెన్సులు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
మూడు గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసుల వద్దగానీ, ఫైర్ సిబ్బంది వద్దగానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు బాధితులను కాపాడేందుకు వాడే పరికరాలు ఏవీ ఉండవా…అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. తాము కొన్నిగ్యాస్ కట్టర్లను సేకరించి తీసుకువచ్చామని, అయితే వాటిని వాడే శిక్షణ ఉన్నవారు అక్కడ లేరని ఒక స్థానిక వ్యాపారి వాపోయాడు. దీని వలన సహాయక చర్యలు వేగంగా జరగలేదని, ప్రాణనష్టం పెరిగిందని ఆయన అన్నాడు. ఈ ప్రమాద సహాయక చర్యల్లో ఆరు జాతీయ విపత్తు స్పందన దళాలు, 400మంది సైనికులు, కోల్‌కతా విపత్తు సహాయక పోలీసు బృందానికి చెందిన 150మందితో పాటు దాదాపు నాలుగువందల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
ఇలాంటి సమయాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తారు. కానీ, సహాయక చర్యలకు అవసరమైన యంత్ర పరికరాలు, ఆ చర్యలు చేపట్టాల్సిన క్రమం తెలిసి ఉన్న సిబ్బంది అత్యవసరం. వంతెనలు కట్టడమే కాదు, దురదృష్టవశాత్తూ కూలిపోతే ప్రాణ హానిని సాధ్యమైనంతవరకు తగ్గించుకోగల శక్తి కూడా అభివృద్ధే అని ఇలాంటి సందర్భాలే రుజువు చేస్తాయి. ఈ ఫ్లైఓవర్‌ని నిర్మిస్తున్న ఐవీఆర్‌సీఎల్ సంస్థ సీనియర్ అధికారులు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. దుర్ఘటనని విధి లిఖితమని ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు!!!