‘’ప్రజలే నన్ను టీడీపీలోకి తీసుకెళ్తున్నారు’’- జగన్‌కు జ్యోతుల సూచన
వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతులు నెహ్రు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 8న నెహ్రు, అతడి తోడల్లుడు, ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన జ్యోతుల నెహ్రు… ప్రజలే తనను టీడీపీలోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. ఎన్నో పదవులు చేతిదాక వచ్చిపోయాయని… పదవులు తనకు లెక్కేకాదన్నారు. అదే సమయంలో వైసీపీపైనా విమర్శలు చేశారు. వైసీపీలో సమిష్టి నాయకత్వానికి చోటు లేదన్నారు. ఆ పార్టీ పరిణితి చెందలేదని విమర్శించారు. తాను […]
వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతులు నెహ్రు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 8న నెహ్రు, అతడి తోడల్లుడు, ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన జ్యోతుల నెహ్రు… ప్రజలే తనను టీడీపీలోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. ఎన్నో పదవులు చేతిదాక వచ్చిపోయాయని… పదవులు తనకు లెక్కేకాదన్నారు. అదే సమయంలో వైసీపీపైనా విమర్శలు చేశారు. వైసీపీలో సమిష్టి నాయకత్వానికి చోటు లేదన్నారు. ఆ పార్టీ పరిణితి చెందలేదని విమర్శించారు. తాను పార్టీ వీడిన తర్వాతైనా జగన్‌లో మార్పు రావాలన్నారు. అయితే వైసీపీ తీరును విమర్శించడంతో పాటు జగన్‌కు పెద్దమనిషి తరహాలో సూచనలు చేసిన జ్యోతుల నెహ్రు… వైసీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంపై మాత్రం మాట్లాడలేదు. జ్యోతుల నెహ్రు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉంటే ఆయనకు హుందాగా ఉండేది.
Click on Image to Read: