వెంకన్న ఆలయంలో సిబ్బంది రాసలీలలు
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ సిబ్బంది రాసలీలలు వెలుగుచూశాయి. ఆలయ సత్రంలోనే సిబ్బంది మందు, పొందుతో రెచ్చిపోయారు. స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా టీటీడీ నుంచి వచ్చిన సిబ్బందికి సత్రంలో వసతి కల్పించారు. రాత్రి సత్రంలోకి.. ఆలయంలో పనిచేసే సిబ్బంది ఒక మహిళను తీసుకువచ్చారు. టీటీడీ ఉద్యోగిగా చేరిన వెంకటరమణమూర్తితోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు రాత్రంతా మద్యం సేవించి సరససల్లాపాల్లో మునిగితేలారు. మూర్తి ఆ మహిళతో రాసలీలలు జరుపుతున్న సమయంలో మిగతావారు సెల్ఫోన్లో చిత్రీకరించారు. […]
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ సిబ్బంది రాసలీలలు వెలుగుచూశాయి. ఆలయ సత్రంలోనే సిబ్బంది మందు, పొందుతో రెచ్చిపోయారు. స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా టీటీడీ నుంచి వచ్చిన సిబ్బందికి సత్రంలో వసతి కల్పించారు. రాత్రి సత్రంలోకి.. ఆలయంలో పనిచేసే సిబ్బంది ఒక మహిళను తీసుకువచ్చారు. టీటీడీ ఉద్యోగిగా చేరిన వెంకటరమణమూర్తితోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు రాత్రంతా మద్యం సేవించి సరససల్లాపాల్లో మునిగితేలారు. మూర్తి ఆ మహిళతో రాసలీలలు జరుపుతున్న సమయంలో మిగతావారు సెల్ఫోన్లో చిత్రీకరించారు. మూర్తి చెవిపై చిన్నపాటి గాయం ఉండడాన్ని కూడా స్థానికులు గమనించారు. రాత్రి వచ్చిన మహిళే అతడిని గాయపరిచిందని చెప్పుకుంటున్నారు. ఆలయ సత్రంలోనే ఈ ఘటన జరగడం, మీడియాలో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. విచారణకు ఆదేశించారు. ఆలయంలో ఇలాంటి పనులకు తెగబడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నరు. ప్రస్తుతం ఈ ఆలయం టీటీడీ నిర్వాహణలో నడుస్తోంది.
Click on Image to Read: