జగన్ వ్యూహంలో లోపమా? వ్యూహకర్తల లోపమా?
మొదటిసారి మోసపోతే మోసగించిన వాడి తప్పు. రెండోసారి మోసపోతే…. మూడోసారి కూడా మోసపోతే. అప్పుడు తప్పు మోసగించిన వాడిది కాదు. మోసపోయిన వాడిదే. ఇప్పుడు వైసీపీదీ అదే పరిస్థితి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మూడుసార్లు ప్రభుత్వం చేతిలో మోసపోయింది. తొలుత ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారు. కానీ ప్రభుత్వం ఎలాంటి ఎత్తు వేస్తుందో అంచనా వేయకుండా … ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని భ్రమల్లో బతికేసింది వైసీపీ. తీరా చూస్తే అప్పటికప్పుడు చర్చకు అనుమతించడం ద్వారా విప్ జారీకి […]
మొదటిసారి మోసపోతే మోసగించిన వాడి తప్పు. రెండోసారి మోసపోతే…. మూడోసారి కూడా మోసపోతే. అప్పుడు తప్పు మోసగించిన వాడిది కాదు. మోసపోయిన వాడిదే. ఇప్పుడు వైసీపీదీ అదే పరిస్థితి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మూడుసార్లు ప్రభుత్వం చేతిలో మోసపోయింది. తొలుత ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారు. కానీ ప్రభుత్వం ఎలాంటి ఎత్తు వేస్తుందో అంచనా వేయకుండా … ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని భ్రమల్లో బతికేసింది వైసీపీ. తీరా చూస్తే అప్పటికప్పుడు చర్చకు అనుమతించడం ద్వారా విప్ జారీకి అవకాశం లేకుండాపోయింది. ప్రభుత్వంపై, స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టిన రెండుసార్లు ఒకే ఎత్తును ప్రభుత్వం ప్రయోగించినా దాన్ని అడ్డుకోలేకపోయారు.
సరే రెండుసార్లు టైమ్ లేదు కాబట్టి విప్ జారీ చేసి ఉండకపోవచ్చు. మరీ ద్రవ్యవినిమయ బిల్లు సమయంలో జరిగిన దానికి తప్పు ఎవరిది?. ప్రభుత్వం మోసపూరితంగానే సభ నడుపుతోందని రెండుసార్లు రుజువైన తర్వాత కూడా వైసీపీ బుర్రలు తెలివిగా ఆలోచించకపోతే ఎలా?. ‘’విప్ జారీ చేశాం… ఈ విషయం స్పీకర్‌కు చెప్పాం’’ కాబట్టి జరగాల్సింది అదే జరిగిపోతుందన్న భ్రమల్లో బతికేశారే గానీ ప్రభుత్వం ఈసారి ఎలాంటి ఎత్తు వేస్తుందన్నది ఆలోచించలేకపోయారు. సభలో ప్రభుత్వం చేసింది అన్యాయమే అయినా… యనమల ఒక విషయం చెప్పారు. ఎప్పుడైనా ఓటింగ్ డిమాండ్స్‌పై ఉంటుందని … బిల్లుపై ఉండదని ఒక వాదన యనమల వినిపించారు. ఇక్కడే వైసీపీ బొక్కబోర్లా పడింది. జగన్‌కు సలహాదారులుగా ఉన్న మేధావులకు ఏమాత్రం ఆలోచన శక్తి ఉన్నా ఈ ఎత్తును కూడా ముందే పసిగట్టేవారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయించే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఘటన వస్తుందన్న దానిపై ముందే ప్రతివ్యూహరచన జరిగేది. కానీ జగన్‌కు సలహాలు ఇచ్చే ఉద్యోగులకు విప్ జారీ చేయడం ఎలా అన్నది మాత్రమే తెలిసినట్టుగా ఉంది. ఆకుకు, అరటిపండుకు తేడా తెలియని కొందరు ఉద్యోగుల సలహాల వల్ల జగన్ చాలా సార్లు నష్టపోతున్నారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.
మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత… ఓటమిపై నిజాయితీగా పోస్టుమార్టం చేసుకునే అవకాశం కూడా జగన్‌కు ఒక వర్గం మేధావులు ఇవ్వలేదన్నది అందరికీ తెలిసిన నిజం. ఓటమికి కారణాలు విశ్లేషించకుండా… ‘’సార్ మీరు సీఎం కాలేకపోయినందుకు జనం తెగబాధపడిపోతున్నారంటూ’’ తిరిగి డబ్బా వాయించిన డీవీడీ ప్లేయర్ల సౌండ్ దెబ్బకు వైసీపీ పదేపదే తప్పటడుగులు వేస్తూనే ఉంది. అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కోర్టుకు వెళ్తామని జగన్ చెబుతున్నారు. కానీ ఈ పని చేయాల్సింది ఇప్పుడు కాదు. ప్రభుత్వంపై, స్పీకర్ పై అవిశ్వాసం సమయంలోనే అధికారపక్షం మోసగించిన సమయంలోనే వెళ్లాల్సింది. ఇప్పటికైనా రాజకీయ అవగాహన లేకుండా ఎదో జీతం రాళ్లకోసం పనిచేసే వాళ్లను దూరంగా పెట్టి… రాజకీయాల్లో తలపండిన వారి సలహాలు వింటే చంద్రబాబు ఎత్తులను చిత్తు చేసిన వారు అవుతారు. అలా చేయలేని పక్షంలో ఈమూడేళ్లలో మరోసారి అవిశ్వాసం అంటూ, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయిస్తాం అంటూ భీకర గర్జనలు చేయకపోవడమే వైసీపీకి మంచిది.
Click on Image to Read: