అరటి పండు....ఆరోగ్యాన్ని పిండేస్తుంది!
సాధారణంగా ఎవరైనా పళ్లను తింటే ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. అనారోగ్యాల బారిన పడి కోలుకునేందుకు ప్రత్యేకంగా పళ్లను తినేవారూ ఉన్నారు. అయితే పళ్లు ఆరోగ్యం ఇవ్వడం కాదు, ఉన్న ఆరోగ్యాన్ని నాశనం చేసే పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. పళ్లను తాజాగా ఉంచడానికి వాటిని కార్బన్ డైజన్ అనే హానికరమైన రసాయనంతో కడుగుతున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోని 22 గోడౌన్లపై దక్షిణ మండలం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా ఈ చేదునిజాలు వెలుగుచూశాయి. పచ్చిగా ఉన్నవాటిని […]
సాధారణంగా ఎవరైనా పళ్లను తింటే ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. అనారోగ్యాల బారిన పడి కోలుకునేందుకు ప్రత్యేకంగా పళ్లను తినేవారూ ఉన్నారు. అయితే పళ్లు ఆరోగ్యం ఇవ్వడం కాదు, ఉన్న ఆరోగ్యాన్ని నాశనం చేసే పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. పళ్లను తాజాగా ఉంచడానికి వాటిని కార్బన్ డైజన్ అనే హానికరమైన రసాయనంతో కడుగుతున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోని 22 గోడౌన్లపై దక్షిణ మండలం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా ఈ చేదునిజాలు వెలుగుచూశాయి. పచ్చిగా ఉన్నవాటిని పళ్లుగా మార్చేందుకు వాడుతున్న రసాయనాలతో పాటు, అత్యంత హానికరమైన కార్బన్ డైజన్‌తో పళ్లను కడగడం పోలీసులు గుర్తించారు. ఇలా చేయడం వలన పళ్లు నాలుగైదు రోజుల పాటు కళ కోల్పోకుండా ఉంటాయి.
దాడులు నిర్వహించిన గోడౌన్లలోని పళ్లు, రసాయనాలను ప్రయోగశాలకు పంపుతున్నట్టుగా దక్షిణమండలం డీసీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుండి తెప్పించిన అరటి కాయలను గోడౌన్లలో మగ్గించి వ్యాపారులకు విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాడితే హానికరమని సీసాలపై ఉన్నా అలాంటి రసాయనాలనే అరటిపళ్లను మగ్గించేందుకు వీరు వాడుతున్నారు. కొత్తపంటలకోసం దాచిన విత్తనాలు, బూజు పట్టకుండా ఉండేందుకు వాడే ఫంగిసైడ్‌ను అరటి కాయలను మగ్గించడం కోసం వాడుతున్నారు. రస్‌పాన్, ఈపీ-50 అనే రసాయనాలను రెండురోజులపాటు గెలలమీద పిచికారీ చేస్తే మూడోరోజుకల్లా కాయలు పళ్లుగా మారిపోతాయి. తరువాత వీటిని నాలుగైదు రోజులు తాజాగా ఉంచడానికి కార్బన్‌డైజన్ అనే ప్రమాకరమైన రసాయనంతో కడుగుతున్నారు. ఇది పళ్లతో పాటు తినేవారి పొట్టలోకి చేరి అల్సర్, జీర్ణాశయ సమస్యలతో పాటు క్యాన్సర్‌ని కూడా కలిగించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. పండే తినేవారి పాలిట విషమై పోవడం అనేది అత్యంత ఘోరమైన విషయం. ఈ అక్రమాలను పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉంది.