మీ ఎమ్మెల్యేకు చంద్రబాబు 2 కోట్లు ఇచ్చారు… కావాలంటే ఆయన్నే అడగండి
అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం సమయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అనుమానాలు రేకెత్తించేందుకు అన్నారో… లేక అందులో నిజముందో గానీ నియోజవర్గాల అభివృద్ధి నిధులకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ వైసీపీ ఎమ్మెల్యేలకు ఇవ్వలేదని ప్రతిపక్షం ఆందోళన చేయగా…అందుకు యనమల కౌంటర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఎస్‌డీఎఫ్ కింద ఇప్పటి వరకు రెండు వందల కోట్లు ఇచ్చాం. ఇంకా రూ. 300 కోట్లు […]
అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం సమయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అనుమానాలు రేకెత్తించేందుకు అన్నారో… లేక అందులో నిజముందో గానీ నియోజవర్గాల అభివృద్ధి నిధులకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ వైసీపీ ఎమ్మెల్యేలకు ఇవ్వలేదని ప్రతిపక్షం ఆందోళన చేయగా…అందుకు యనమల కౌంటర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఎస్‌డీఎఫ్ కింద ఇప్పటి వరకు రెండు వందల కోట్లు ఇచ్చాం. ఇంకా రూ. 300 కోట్లు ఉన్నాయి. చంద్రబాబును కలిసి అడిగితే మీకూ ఇస్తారు. ఇప్పటికే మీ పార్టీలో ఓ పది మందికి ఇచ్చినట్టు రికార్డుల్లో ఉంది” అని అన్నారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇచ్చి ఉంటారని వైసీపీ సభ్యులు అనడంతో.. ‘’కాదు అరకు ఎమ్మెల్యేకు కూడా డబ్బులిచ్చాం. సీఎం ఆయనకు రెండు కోట్లు ఇచ్చినట్టు జాబితాలో ఉంది” అని యనమల వ్యాఖ్యానించారు. కావాలంటే ఆయన్నే అడగండి అని కూడా సూచించారు యనమల.
ప్రస్తుతం అరకు నుంచి వైసీపీ తరపున సర్వేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కొణతాల రామకృష్ణకు సన్నిహితుడు కూడా. ఇప్పటికే కొణతాల టీడీపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన శిష్యుడు సర్వేశ్వరరావుపై యనమల ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా ఉంది. వైసీపీలో ఎవరికీ ఎస్‌డీఎఫ్ ఫండ్ అందనప్పుడు ఒక సర్వేశ్వరరావుకు మాత్రమే రెండు కోట్లు ఎలా అందాయో!. ఇందులో నిజమెంతుందో అరకు ఎమ్మెల్యేకే తెలియాలి.
Click on Image to Read: