Telugu Global
Cinema & Entertainment

కోర్టు కేసులో చిక్కుకున్న పవన్ సినిమా

పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కోర్టు కేసులో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మాతకు కాపీరైట్ హక్కుల కింద… ఏకంగా కోర్టు నోటీసులు అందాయి. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్… ఈ నోటీసులు పంపించాడు. గతంలో దబాంగ్ సినిమాకు రీమేక్ గా గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించాడు పవన్. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ మరో సినిమాను తీస్తున్నాడు. అయితే గబ్బర్ సింగ్ కు , సర్దార్ సినిమాకు సంబంధం లేదు. రెండు […]

కోర్టు కేసులో చిక్కుకున్న పవన్ సినిమా
X

పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కోర్టు కేసులో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మాతకు కాపీరైట్ హక్కుల కింద… ఏకంగా కోర్టు నోటీసులు అందాయి. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్… ఈ నోటీసులు పంపించాడు. గతంలో దబాంగ్ సినిమాకు రీమేక్ గా గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించాడు పవన్. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ మరో సినిమాను తీస్తున్నాడు. అయితే గబ్బర్ సింగ్ కు , సర్దార్ సినిమాకు సంబంధం లేదు. రెండు కథలు వేరు. కేవలం టైటిల్స్ లో మాత్రమే చిన్న పోలిక ఉంది. మరోవైపు దబాంగ్-2 సినిమాకు కూడా సర్దార్ తో ఎలాంటి పోలికలు లేవు. స్వయంగా పవన్ కల్యాణ్ కథ రాసి, స్క్రీన్ ప్లే సమకూర్చి సొంత క్రియేటివిటీతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇలాంటి మూవీకి కాపీరైట్ యాక్ట్ కింద కోర్టు నోటీసులు పంపించడంతో యూనిట్ అంతా అవాక్కయిపోయింది. ప్రస్తుతం పవన్ స్విట్జర్లాండ్ లో ఉన్నాడు. సర్దార్ సినిమాకు సంబంధించి కాజల్ తో కలిసి రెండు పాటల చిత్రీకరణలో ఉన్నాడు. ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఈ లీగల్ నోటీసుపై ఓ క్లారిటీ రానుంది.

First Published:  30 March 2016 4:01 PM IST
Next Story