హాలీవుడ్ కే పోటీనిస్తున్న ఊపిరి
ఊపిరి సినిమాకు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాదాపు 8లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఈ సినిమా రెస్పాన్స్ చూసి స్వయంగా ఫోర్బ్స్ పత్రిక ఊపిరిని మెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ పత్రిక, ఊపిరి సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకుంది. అమెరికా అంతటా 160 తెరలపై విడుదలైన ఊపిరి సినిమాను అమెరికాలోని తెలుగువారు హాలీవుడ్ మూవీ సూపర్ మేన్ వెర్సెస్ బ్యాట్ మేన్ కన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారని తన విశ్లేషణలో రాసుకొచ్చింది. ఇండియన్స్ ఎవరూ… […]
BY admin30 March 2016 4:52 AM IST
X
admin Updated On: 30 March 2016 5:39 AM IST
ఊపిరి సినిమాకు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాదాపు 8లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఈ సినిమా రెస్పాన్స్ చూసి స్వయంగా ఫోర్బ్స్ పత్రిక ఊపిరిని మెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ పత్రిక, ఊపిరి సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకుంది. అమెరికా అంతటా 160 తెరలపై విడుదలైన ఊపిరి సినిమాను అమెరికాలోని తెలుగువారు హాలీవుడ్ మూవీ సూపర్ మేన్ వెర్సెస్ బ్యాట్ మేన్ కన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారని తన విశ్లేషణలో రాసుకొచ్చింది. ఇండియన్స్ ఎవరూ… ఊపిరి మినహా మిగతా థియేటర్లకు ఎక్కువగా పోవడం లేదని చెప్పుకొచ్చింది. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ పేరిట వచ్చిన ఈ సినిమా లాంగ్వేజ్ కు అతీతంగా భారత్ కు చెందిన పలు భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందని రాసుకొచ్చింది. గతంలో పలు బాలీవుడ్ సినిమాల గురించి ఫోర్బ్స్ పత్రిక చాలా ఆర్టికల్స్ రాసింది. అందులో షారూక్, సల్మాన్, అమీర్ ఖాన్ ల సినిమాలు ఉన్నాయి. కానీ ఊపిరి లాంటి ఓ తెలుగు సినిమా గురించి ప్రశంసిస్తూ ఫోర్బ్స్ రాయడం మాత్రం ఇదే తొలిసారి. ఊపిరి టీం సాధించిన విజయాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు.
Next Story