కుప్పం నియోజకవర్గంలో సర్వే చేయించిన వైసీపీ ఎమ్మెల్యే
ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాల అంశం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ … ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. స్కూళ్లలో తాగు నీరు కూడా ఉండడం లేదన్నారు. ఈ పరిస్థితి తన నియోజకవర్గంలోనే ఉందా లేక హైదరాబాద్‌ను నిర్మించానని చెప్పుకునే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ ఉందా అన్న ఆసక్తి కలిగిందన్నారు. అందుకే ప్రత్యేక టీంను పంపించి కుప్పం నియోజకవర్గంలోని స్కూళ్లపై సర్వే చేయించానన్నారు. 60 స్కూళ్లకు వెళ్తే […]
ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాల అంశం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ … ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. స్కూళ్లలో తాగు నీరు కూడా ఉండడం లేదన్నారు. ఈ పరిస్థితి తన నియోజకవర్గంలోనే ఉందా లేక హైదరాబాద్‌ను నిర్మించానని చెప్పుకునే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ ఉందా అన్న ఆసక్తి కలిగిందన్నారు. అందుకే ప్రత్యేక టీంను పంపించి కుప్పం నియోజకవర్గంలోని స్కూళ్లపై సర్వే చేయించానన్నారు. 60 స్కూళ్లకు వెళ్తే ఎక్కడా కూడా తాగేందుకు మంచి నీరు లేదని తేలిందన్నారు. బాత్‌రూమ్‌ల అనవాళ్లు కూడా లేవన్నారు. ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న స్కూళ్లకు ప్రహారి గోడలు కూడా లేవన్నారు. కుప్పం నియోజవర్గంలోని స్కూళ్ల పరిస్థితిపై భారీ సంఖ్యలో ఫోటోలను కూడా సభకు తీసుకొచ్చారు అనిల్ కుమార్. ఇంత దారుణమైన పరిస్థితి సీఎం నియోజకవర్గంలోనే ఉండడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ్యమంత్రి, ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చంద్రబాబు దగ్గర తాము నేర్చుకోవాల్సింది ఇదేనా అని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.
Click on Image to Read: