Telugu Global
Cinema & Entertainment

క‌ర‌ణ్ జోహార్ చేతికి ఊపిరి రీమేక్ రైట్స్...!

కొన్ని చిత్రాలు చేసే ముందు కొంత భ‌యం క‌లిగిస్తాయి. రోటిన్ కు భిన్న‌మైన క‌థ‌లు చేస్తే ఆడియ‌న్స్ అంగీక‌రిస్తారో లేదో అనే ఒక సంశ‌యం వెంటాడుతుంది. ఊపిరి సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు అదే వెంటాడింది. క‌ట్ చేస్తే సినిమాకు ఇప్పుడు ఆడియ‌న్స్.. అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇంటచ్ బుల్స్ అనే ఒక ఫ్రెండ్ చిత్రం ఆధారంగా వ‌చ్చిన ఈ చిత్రం నిజంగా తెలుగులో రోటిన్ చిత్రాల‌కు పెద్ద బ్రేక‌ప్ అనే చెప్పాలి. చేసేట‌ప్పుడు అటు ద‌ర్శ‌కుడికి.. […]

క‌ర‌ణ్ జోహార్ చేతికి ఊపిరి రీమేక్ రైట్స్...!
X

కొన్ని చిత్రాలు చేసే ముందు కొంత భ‌యం క‌లిగిస్తాయి. రోటిన్ కు భిన్న‌మైన క‌థ‌లు చేస్తే ఆడియ‌న్స్ అంగీక‌రిస్తారో లేదో అనే ఒక సంశ‌యం వెంటాడుతుంది. ఊపిరి సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు అదే వెంటాడింది. క‌ట్ చేస్తే సినిమాకు ఇప్పుడు ఆడియ‌న్స్.. అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇంటచ్ బుల్స్ అనే ఒక ఫ్రెండ్ చిత్రం ఆధారంగా వ‌చ్చిన ఈ చిత్రం నిజంగా తెలుగులో రోటిన్ చిత్రాల‌కు పెద్ద బ్రేక‌ప్ అనే చెప్పాలి. చేసేట‌ప్పుడు అటు ద‌ర్శ‌కుడికి.. ఇటు హీరోల‌కు ఒకింత మ‌న‌సులో ఎక్క‌డో తెలియ‌ని భ‌యమే వెంటాడింది.

ఫైన‌ల్ గా ఊపిరి చిత్రం తెలుగు, త‌మిళ ఆడియ‌న్స్ ను మెప్పిస్తుండ‌టంతో.. ఈ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ చేయ‌డానికి అప్పుడే స్టార్ హీరోలు ఆలోచ‌న చేస్తున్నారు. అల్రేడి ఊపిరి సినిమా రైట్స్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కొనుగోలు చేసిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. మ‌రి తెలుగులో పోషించిన నాగార్జున రోల్ కు హిందిలో కూడా నాగార్జున‌ను తీసుకుంటాడా..? లేడా బి టౌన్ స్టార్స్ తోనే పూర్తిగా అక్క‌డ ఆడియ‌న్స్ కు రీచ్ అయ్యేలా చేస్తాడా అనేది తెలియాల్సి వుంది.

First Published:  30 March 2016 7:44 AM IST
Next Story