నేడు పఠాన్‌కోట్‌లో పాక్ బృందం...ఎక్కడ తిరగాలో ఎన్ఐఎ చెబుతుంది!
పఠాన్‌కోట్ ఉగ్రదాడికి సంబంధించి పాక్‌నుండి వచ్చిన సంయుక్త దర్యాప్తు బృందం మంగళవారం వైమానిక స్థావరంలోని దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లనుంది. దాడి జరిగిన ప్రాంతంలోని పరిసరాలను పరిశీలించి, సాక్ష్యులను ప్రశ్నించనుంది. అయితే పాక్‌నుండి వచ్చిన సంయుక్త దర్యాప్తు బృందం (జిట్), పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి వెళ్లేందుకు ఎలా అనుమతిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించిన నేపథ్యంలో రక్షణశాఖా మంత్రి మనోహర్ పారికర్, వారు వైమానిక స్థావరంలో ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతి లేదని, వైమానిక స్థావరంలోని కీలక స్థావరాల జాడ తెలియకుండా […]
పఠాన్‌కోట్ ఉగ్రదాడికి సంబంధించి పాక్‌నుండి వచ్చిన సంయుక్త దర్యాప్తు బృందం మంగళవారం వైమానిక స్థావరంలోని దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లనుంది. దాడి జరిగిన ప్రాంతంలోని పరిసరాలను పరిశీలించి, సాక్ష్యులను ప్రశ్నించనుంది. అయితే పాక్‌నుండి వచ్చిన సంయుక్త దర్యాప్తు బృందం (జిట్), పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి వెళ్లేందుకు ఎలా అనుమతిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించిన నేపథ్యంలో రక్షణశాఖా మంత్రి మనోహర్ పారికర్, వారు వైమానిక స్థావరంలో ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతి లేదని, వైమానిక స్థావరంలోని కీలక స్థావరాల జాడ తెలియకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తగిన జాగ్రత్తలను తీసుకుంటుందని వివరించారు. వైమానిక స్థావరంలోకి ఎవరిని, ఎంతవరకు అనుమతించాలి, ఎవరిని అనుమతించకూడదు అనే నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ దర్యాప్తు సంస్థేనని అయన అన్నారు. పాక్ సంయుక్త బృందంలో పాక్ మిలటరీకి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సభ్యుడు కూడా ఉండటంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
పఠాన్‌కోట్ దాడిలో భయంకర ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్, అతని సోదరుడు అబ్దుల్ రౌఫ్‌ల పాత్ర ఉందని అందరికీ తెలుసు, అయినా పాక్ ప్రభుత్వం ఆ తీవ్రవాద సంస్థని నిషేధించడం కానీ, అజహర్‌నో, అతడి సోదరునో అరెస్టు చేయడం కానీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. భారత ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా పాక్ దర్యాప్తు బృందానికి ఘనస్వాగతం పలికిందని, వారి దర్యాప్తుకి సహకరిస్తూ, జాతీయ భద్రతని ప్రశ్నార్థకంగా మార్చిందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడమే పనిగా పెట్టుకున్న పాక్‌పై మోడీ మెతకవైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
ఉగ్రవాదుల ఫోన్‌కాల్స్ వివరాలను వెల్లడించడానికి భారత్ సమ్మతించగా, పాక్ దర్యాప్తు బృందం ఈ దాడికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌లను పరిశీలించేందుకు, ఐఎఎఫ్ కమాండర్‌ని ప్రశ్నించడానికి కూడా అనుమతి కోరింది. ఈ వ్యవహారం మొత్తంలో జాతీయ భద్రతా నిపుణులకు, దేశప్రజలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది.