కారణాలు చెబుతూ జగన్‌కు జ్యోతుల రాజీనామా లేఖ
ఊహించినట్టుగానే వైసీపీకి ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జగన్‌కు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. మీ మనసుకు నచ్చినట్టు నడుచుకోలేకపోతున్నానని జగన్‌కు రాసిన లేఖలో జ్యోతుల వివరించారు. జ్యోతుల నెహ్రు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గానే కాకుండా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కూడా […]
ఊహించినట్టుగానే వైసీపీకి ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జగన్‌కు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. మీ మనసుకు నచ్చినట్టు నడుచుకోలేకపోతున్నానని జగన్‌కు రాసిన లేఖలో జ్యోతుల వివరించారు. జ్యోతుల నెహ్రు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గానే కాకుండా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆ పదవులకు కూడా రాజీనామా చేశారు. జ్యోతుల నెహ్రుతో పాటు పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు కూడా పార్టీ వీడుతున్నట్టు కొద్దిరోజుల క్రితమే స్పష్టత వచ్చింది.
Click on Image to Read: