జ్యోతుల జంపింగ్‌పై ఘాటుగా స్పందించిన జగన్
పార్టీ పదవులకు జ్యోతుల నెహ్రు రాజీనామా చేసిన అంశంపై అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో జగన్ స్పందించారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయారన్నారు. పార్టీ మారుతున్న వారికి పదవులు కావాలి గానీ… ప్రజల్లోకి వెళ్లే ధైర్యం మాత్రం లేదన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు. రాజకీయాల్లో ఉన్న తర్వాత వ్యక్తిత్వం ఉండాలన్నారు. చంద్రబాబుకు విశ్వవసనీయత, వ్యక్తిత్వం లేదన్నారు. 20, 30 కోట్లు చంద్రబాబు ఆఫర్ చేస్తుంటే కొందరు లొంగిపోతున్నారని […]
పార్టీ పదవులకు జ్యోతుల నెహ్రు రాజీనామా చేసిన అంశంపై అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో జగన్ స్పందించారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయారన్నారు. పార్టీ మారుతున్న వారికి పదవులు కావాలి గానీ… ప్రజల్లోకి వెళ్లే ధైర్యం మాత్రం లేదన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు. రాజకీయాల్లో ఉన్న తర్వాత వ్యక్తిత్వం ఉండాలన్నారు. చంద్రబాబుకు విశ్వవసనీయత, వ్యక్తిత్వం లేదన్నారు. 20, 30 కోట్లు చంద్రబాబు ఆఫర్ చేస్తుంటే కొందరు లొంగిపోతున్నారని జగన్ అన్నారు.
మంగళవారం ఉదయం పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ జ్యోతుల లేఖను జగన్‌కు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. మీ మనసుకు నచ్చినట్టు నడుచుకోలేకపోతున్నానని జగన్‌కు రాసిన లేఖలో జ్యోతుల వివరించారు. జ్యోతుల నెహ్రు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గానే కాకుండా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆ పదవులకు కూడా రాజీనామా చేశారు. జ్యోతుల నెహ్రుతో పాటు పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు కూడా పార్టీ వీడుతున్నట్టు కొద్దిరోజుల క్రితమే స్పష్టత వచ్చింది.
Click on Image to Read: