నేను చంద్రబాబును కలవను… నిరూపిస్తే రాజీనామా- భూమా నాగిరెడ్డి
కర్నూలు జిల్లాలో నంద్యాల టీడీపీలో వర్గవిబేధాలు అప్పుడే తారా స్థాయికి చేరాయి. భూమా, శిల్పాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. శిల్పామోహన్ ప్రధాన అనుచరుడు, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డిపై భూమావర్గీయులు హత్యాయత్నం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలో భూమానాగిరెడ్డి స్పందించారు. తులసిరెడ్డిపై దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తులసిరెడ్డి స్థానికంగా పంచాయతీలు చేస్తుంటారని… కాబట్టి దాడికి అవే కారణమై ఉండవచ్చు అని అన్నారు. తనపై సీఎంను కలిసి […]
కర్నూలు జిల్లాలో నంద్యాల టీడీపీలో వర్గవిబేధాలు అప్పుడే తారా స్థాయికి చేరాయి. భూమా, శిల్పాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. శిల్పామోహన్ ప్రధాన అనుచరుడు, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డిపై భూమావర్గీయులు హత్యాయత్నం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలో భూమానాగిరెడ్డి స్పందించారు. తులసిరెడ్డిపై దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తులసిరెడ్డి స్థానికంగా పంచాయతీలు చేస్తుంటారని… కాబట్టి దాడికి అవే కారణమై ఉండవచ్చు అని అన్నారు. తనపై సీఎంను కలిసి శిల్పాసోదరులు ఫిర్యాదు చేయడాన్ని ప్రస్తావించగా.. తాను సీఎంను కలవనని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని… సీఎంను కలిసి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇసుక మాఫియాతో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. పార్టీ ఫిరాయించినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని భూమా… ఇప్పుడు ఇసుక మాఫియాతో సంబంధాలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేయడం గమనార్హం.
తాను గొడవల కోసం రాలేదన్నారు. తాను టిడిపిలోకి రావడం కొంతమందికి సంతోషాన్ని మరికొంతమందికి ఇబ్బందిని కలిగించిందన్నారు. శిల్పా తన మనస్సాక్షిని పరిశీలించుకోవాలన్నారు. తనను టిడిపికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇసుక తవ్వకాలతో డబ్బులు వస్తాయా అనే విషయం తనకు ఇటీవలి వరకు తెలియదన్నారు. తన రాకతో కొందరు అభధ్రతభావానికి లోనవుతున్నారని భూమా అన్నారు. టిడిపిలో చంద్రబాబుతో తనకు గ్యాప్ తీసుకు రావాలని కుట్ర చేస్తున్నారని భూమా ఆరోపించారు.
Click on Image to Read: