యనమల రూ. 570 కోట్లు అని స్టేట్‌మెంట్ ఇచ్చారు.. ఆ సొమ్ము ఎక్కడికి పోయింది?
అగ్రిగోల్డ్ అంశంపై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. చర్చలో మాట్లాడిన జగన్… ప్రభుత్వం .. అగ్రిగోల్డ్ యాజమన్యంతో కుమ్మకైందని ఆరోపించారు. అందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను ప్రదర్శించారు. సీబీఐతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయన్న భయంతో చంద్రబాబు ఆఘమేఘాల మీద సీఐడీ విచారణకు ఆదేశించారని చెప్పారు. చివరకు సీఐడీ విచారణ అయినా సరిగా జరుగుతుందా అంటే అది లేకుండా పోయిందన్నారు. వేల కోట్ల కుంభకోణం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్య సభ్యులను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని […]
అగ్రిగోల్డ్ అంశంపై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. చర్చలో మాట్లాడిన జగన్… ప్రభుత్వం .. అగ్రిగోల్డ్ యాజమన్యంతో కుమ్మకైందని ఆరోపించారు. అందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను ప్రదర్శించారు. సీబీఐతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయన్న భయంతో చంద్రబాబు ఆఘమేఘాల మీద సీఐడీ విచారణకు ఆదేశించారని చెప్పారు. చివరకు సీఐడీ విచారణ అయినా సరిగా జరుగుతుందా అంటే అది లేకుండా పోయిందన్నారు. వేల కోట్ల కుంభకోణం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్య సభ్యులను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని సీఐడీ కోర్టుకు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.
బెంగాల్‌లో 2, 460 కోట్ల కుంభకోణం జరిగితే సీబీఐ విచారణ జరిపించారని… మరి 6850 కోట్ల అగ్రిగోల్డ్ స్కాం జరిగితే సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అగ్రిగోల్డ్ భూములు అమ్మారని ఇందుకు సంబందించిన పత్రాలు కూడా ఉన్నాయన్నారు. ఆ భూములు అమ్మిన ఉదయ్ దినకర్‌ను మాత్రం ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని గుర్తు చేశారు. జనవరిలో ఒక ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడిన యనమల రామకృష్ణుడు బ్యాంకుల్లో అగ్రిగోల్డ్ కు చెందిన రూ. 570 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని చెప్పారని సదరు పత్రిక క్లిప్పింగ్స్ చూపించారు. కానీ నెల తిరిగే సరికి సీఐడీ మాత్రం అగ్రిగోల్డ్ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ. 6లక్షలు ఉన్నట్టు కోర్టుకు చెప్పిందన్నారు. రూ. 570 కోట్లు ఎక్కడికి వెళ్లాయని జగన్ ప్రశ్నించారు.
జగన్ చెబుతున్నవన్నీ అవాస్తవం అని మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు వాదించారు. కేసును సీబీఐకి అప్పగిస్తే డిపాజిట్ దారులే నష్టపోతారని అచ్చెన్నాయుడు అన్నారు. అందుకు బాధ్యత వహిస్తామని జగన్ అంటే ఇప్పుడే సీబీఐకి కేసు అప్పగిస్తామన్నారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉందని సీబీఐ విచారణ కావాలనుకుంటే జగన్ కోర్టును ఒప్పించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. దొంగ ఆస్తుల గురించి తమకు, సీఐడీకి తెలియవన్నారు. అలాంటి విషయాలు దొంగల దగ్గరే ఉంటాయన్నారు. వాటిని ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని సమర్పిస్తే అటాచ్ చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. సీబీఐ విచారణ వద్దని కమ్యూనిస్ట్ నాయకులు కూడా సీఎంను కలిసి చెప్పారని ఆయన అన్నారు. ఉదయ్ దినకర్ నుంచి తన భార్య పేరున భూములు కొన్న మాట వాస్తవమేనని… కానీ వాటికి అగ్రిగోల్డ్‌కు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే వాటిని రాసిస్తానని పత్తిపాటి పుల్లారావు అన్నారు.
Click on Image to Read: