మరోసారి వాయిదాపడిన సూపర్ స్టార్ సినిమా
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా మరోసారి వాయిదా పడింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రజనీకాంత్ చేస్తున్న సినిమా కబాలి. ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందుగా తమిళనాట విడుదల చేయాలనుకున్నారు. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 14న కబాలిని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం కబాలి సినిమా ఆ తేదీకి థియేటర్లలోకి రావడం లేదు. కనీసం […]
BY admin28 March 2016 11:32 AM IST
X
admin Updated On: 28 March 2016 12:06 PM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా మరోసారి వాయిదా పడింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రజనీకాంత్ చేస్తున్న సినిమా కబాలి. ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందుగా తమిళనాట విడుదల చేయాలనుకున్నారు. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 14న కబాలిని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం కబాలి సినిమా ఆ తేదీకి థియేటర్లలోకి రావడం లేదు. కనీసం 2 రోజులు ఆలస్యంగా ఏప్రిల్ 16న అయినా వస్తుందనుకుంటే అది కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉంది. షూటింగ్ ప్యాచ్ వర్క్ కూడా మిగిలే ఉంది. మరోవైపు ఆడియో ఫంక్షన్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది. దీంతో హడావుడిగా ఏప్రిల్ లో విడుదల చేసే కంటే… నిదానంగా మే లేదా జూన్ నెలల్లో రిలీజ్ చేస్తే బెటరని రజనీకాంత్ భావిస్తున్నారట.
Next Story