అక్కడ ఊపిరి ఫ్లాప్ అయిందట
నాగార్జున-కార్తి హీరోలుగా నటించిన ఊపిరి సినిమా ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు ఈ సినిమాను. సేమ్ టైం…. తమిళనాట మాత్రం థోజ పేరిట విడుదలైన ఊపిరి సినిమా ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. సినిమా బాగున్నప్పటికీ… తమిళ తంబీలకు అందులో నేటివిటీ టచ్ కనిపించలేదు. ఏ సినిమానైనా నేచురల్ గా చూసేందుకు ఇష్టపడతారు తమిళ ఆడియన్స్. థోజాలో అది […]
BY admin28 March 2016 10:19 AM IST
X
admin Updated On: 28 March 2016 10:38 AM IST
నాగార్జున-కార్తి హీరోలుగా నటించిన ఊపిరి సినిమా ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు ఈ సినిమాను. సేమ్ టైం…. తమిళనాట మాత్రం థోజ పేరిట విడుదలైన ఊపిరి సినిమా ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. సినిమా బాగున్నప్పటికీ… తమిళ తంబీలకు అందులో నేటివిటీ టచ్ కనిపించలేదు. ఏ సినిమానైనా నేచురల్ గా చూసేందుకు ఇష్టపడతారు తమిళ ఆడియన్స్. థోజాలో అది మిస్సయింది. మరీ ముఖ్యంగా పాత్రల డబ్బింగ్ విషయంలో అది ఫక్తు డబ్బింగ్ సినిమాను తలపించింది. కార్తి నటించిన స్ట్రయిట్ తమిళ సినిమా అనే ఫీలింగ్ కలగలేదు. దీంతో అక్కడ ఊపిరికి వసూళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిర్మాత పీవీపీ ప్లానింగ్ పక్కాగా ఉంది. ఒక లాంగ్వేజ్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… మరో భాషలో హిట్టయింది కాబట్టి… లాభాలకు ఢోకా లేదు.
Next Story