యనమలతో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ
వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, వరపుల సుబ్బారావు టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. ఆదివారం రాత్రి మంత్రి యనమల రామకృష్ణుడితో జ్యోతుల నెహ్రు, సుబ్బారావు భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు చర్చించుకున్నారు. వీరిని యనమల వద్దకు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తీసుకొచ్చారు. జ్యోతుల టీడీపీలో చేరేందుకు చాలా రోజుల నుంచే లోలోపల ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అదే జిల్లాకు చెందిన యనమల వ్యతిరేకించడం వల్లే ఆలస్యమైందని భావిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య సంధి కుదరడంతోనే జ్యోతుల […]

వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, వరపుల సుబ్బారావు టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. ఆదివారం రాత్రి మంత్రి యనమల రామకృష్ణుడితో జ్యోతుల నెహ్రు, సుబ్బారావు భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు చర్చించుకున్నారు. వీరిని యనమల వద్దకు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తీసుకొచ్చారు. జ్యోతుల టీడీపీలో చేరేందుకు చాలా రోజుల నుంచే లోలోపల ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అదే జిల్లాకు చెందిన యనమల వ్యతిరేకించడం వల్లే ఆలస్యమైందని భావిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య సంధి కుదరడంతోనే జ్యోతుల నెహ్రు చేరిక ఖాయమైపోయిందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో యనమల నివాసానికి జ్యోతుల నెహ్రూ, సుబ్బారావు వెళ్లారు.
Click on Image to Read: