Telugu Global
National

ధోనిపై మళ్లీ తీవ్ర ఆరోపణలు చేసిన యూవీ తండ్రి

క్రికెటర్ యువరాజ్‌ సింగ్ తండ్రి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి కూడా ధోనిని తిట్టడం ద్వారానే తెరపైకి వచ్చారు. యువరాజ్‌ సింగ్‌ ఇటీవల  రాణించడంలో తడబడుతున్నాడు. అయితే ఇందుకు కారణం ధోనియే అంటూ యూవీ ఫాదర్ యోగరాజ్ సింగ్ మండిపడ్డారు. తన కుమారుడిని ఏడో స్థానంలో బ్యాంటింగ్‌పై పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును ధోని ఏం చేయాలనుకుంటున్నాడని ప్రశ్నించాడు. ఆ సమయంలో ఒక బూతుమాటను కూడా ధోనిని ఉద్దేశించి యోగరాజ్ వాడారు.  బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు సహజమని […]

ధోనిపై మళ్లీ తీవ్ర ఆరోపణలు చేసిన యూవీ తండ్రి
X

క్రికెటర్ యువరాజ్‌ సింగ్ తండ్రి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి కూడా ధోనిని తిట్టడం ద్వారానే తెరపైకి వచ్చారు. యువరాజ్‌ సింగ్‌ ఇటీవల రాణించడంలో తడబడుతున్నాడు. అయితే ఇందుకు కారణం ధోనియే అంటూ యూవీ ఫాదర్ యోగరాజ్ సింగ్ మండిపడ్డారు. తన కుమారుడిని ఏడో స్థానంలో బ్యాంటింగ్‌పై పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కొడుకును ధోని ఏం చేయాలనుకుంటున్నాడని ప్రశ్నించాడు. ఆ సమయంలో ఒక బూతుమాటను కూడా ధోనిని ఉద్దేశించి యోగరాజ్ వాడారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు సహజమని కానీ ఇప్పుడు మాత్రం ఆ మార్పులు అసహజంగా ఉన్నాయని మండిపడ్డారు. బౌలింగ్ విషయంలోనూ కావాలనే యూవీని ధోని దూరంగా ఉంచుతున్నాడని ఆరోపించారు. 2011 వరల్డ్ కప్‌లో యూవీ 15 వికెట్లు తీసిన విషయం ధోనికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శల ఫలితమో ఏదో గానీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మాత్రం యూవీ బౌల్ చేయగలిగాడు. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై తిరిగి జట్టులోకి తన కుమారుడు వచ్చాడని చెప్పారు. రెండేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండి తిరిగి జట్టులోకి ధోని రాగలడా అని ప్రశ్నించారు. యూవీ అలా తిరిగి రావడం ఒక అద్భుతం అన్నారు. యూవీ అంటే నచ్చకపోతే ఆ విషయాన్ని ధోని నేరుగా సెలెక్టర్లకే చెప్పాలని సూచించారు యోగరాజ్ సింగ్. ప్రస్తుత పరిణామాలపై బాధపడవద్దని తన కుమారుడికి చెప్పినట్టు యోగరాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Click on Image to Read:

yuvaraj dhoni

jaleel-khan

ysrcp MLA Subba rao

balakrishna

ts-assembly

chevireddy-jyotula

lemon

jc-diwakar-jagan-chandrababu

jagapathi

ysrcp

sunny

jc-raghuveera

jagan-achenna

ysrcp-tdp

jagan1

kotla

jagan-koneru

mla-vishnu

traffic-police

chiru-chandrababu

First Published:  27 March 2016 1:02 PM IST
Next Story